నితిన్ మ్యారేజ్ కు కరోనా ఎఫెక్ట్
హైద్రాబాద్, మార్చి 9
టాలీవుడ్ హీరోలను సైతం కరోనా భయం వెంటాడుతోది. దీంతో కొందరు హీరోలు తమ సినిమాలను విడుదల చేయకుండా వాయిదాలు వేసుకున్నారు. మరికొందరు పాపం పెళ్లిళ్లు కూడా ప్రశాంతంగా చేసుకోలేకపోతున్నారు. ‘జయం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరో నితిన్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నితిన్ నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. నాగర్ కర్నూల్లోని ప్రగతి నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్న డాక్టర్ సంపత్ కుమార్, నూర్జహాన్ దంపతుల కమార్తె షాలినితో నితిన్‌కు నిశ్చితార్థం జరిగింది. అయితే వచ్చేనెల అంటే ఏప్రిల్ 16న వీరిద్దరి పెళ్లి జరిపించాలని పెద్దలు ముహుర్తం నిర్ణయించారు. పెళ్లి వేదిక దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరపాలనుకున్నారు. పెళ్లి వేడుక కోసం వధూవరులకు కంచి, చెన్నైలో బట్టలు కూడా కొనుగోలు చేశారు.ఓ వైపు పెళ్లి ఏర్పాట్లు చక చక జరుగుతుంటుంటే... ఇంతలో కరోనా వైరస్ రావడంతో... ఇప్పుడు నితిన్ షాలినిల పెళ్లి వేడుకలపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. పెళ్లి తేదీని వాయిదా వేయాలా ? లేక అనుకున్న ముహుర్తానికి వివాహం జరిపించాలా అన్న సందిగ్ధంలో ఇరు కుటుంబాల పెద్దలు ఉన్నట్లు సమాచారం. నితిన్ పెళ్లిని దుబాయ్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించాలనుకున్నారు. అయితే కరోనా వైరస్ భయంతో ఇప్పటికే అరబ్ దేశాలు కఠినమైన ఆంక్షలు విధించాయి. ముస్లీంల పవిత్ర నగరం మక్కాలో ఉమ్రా యాత్రలను సైతం కొన్నిరోజుల పాటు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో మరి దుబాయ్‌లో నితిన్ పెళ్లి వేడుక జరిగే అవకాశం ఉందా అన్న డౌట్స్ తలెత్తుతున్నాయి.అయితే ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న ముహుర్తానికి వివాహం జరపించాలని ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు కరోనా వైరస్ అదుపులోకి వస్తే దుబాయ్‌లో లేకుంటే హైదరాబాద్‌లోనే పెళ్లి వేడుక నిర్వహించాలని ఇరు కుటుంబాలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హైదరాబాద్ శివారుల్లోని ఓ ఫాం హౌజ్‌లో పెళ్లి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రానున్న 15 రోజుల్లో కరోనా వైరస్ పరిస్థితిని బట్టి మ్యారేజ్ ఈవెంట్ దుబాయ్‌లో నిర్వహించాలా? లేదంటే హైదరాబాద్‌లోనా ? అనే విషయాన్ని ఇరుకుటుంబాల పెద్దలు డిసైడ్ చేయనున్నారు. ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే... హైదరబాద్ శివారుల్లోనే.. కొద్దిమంది బంధువులు, సీని ప్రముఖుల మధ్య పెళ్లి వేడుక నిర్వహించి... ఏప్రిల్ 21న హైటెక్స్‌లో గ్రాండ్‌గా రిసప్షన్ చేయాలనుకుంటున్నారు. మొత్తం మీద నితిన్‌ని కూడా కరోనా వైరస్ ఎఫెక్ట్ తప్పేలా లేదు.