YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

 మారుతీరావు మరణంపై అనుమానాలు

 మారుతీరావు మరణంపై అనుమానాలు

 మారుతీరావు మరణంపై అనుమానాలు
హైద్రాబాద్, మార్చి 9
అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మారుతీరావు మరణంపై పోలీసులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఆయనది హత్యా?... ఆత్మహత్యా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పటికే పోలీసులు అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేశారు. కూతురు వేరే కులం యువకుడిని పెళ్లి చేసుకుందని.. అల్లుడిపై పరువు హత్యకు పాల్పడిన మారుతీరావు విషంతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఆత్మహత్య విషయంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శనివారం ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో అద్దెకు దిగిన మారుతీరావు.. ఆత్మహత్య చేసుకోవాలని మూడు రోజుల ముందు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం తన స్నేహితుడి ఫర్టిలైజర్ షాపు నుంచి పురుగుల మందు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కూతురు అమృతను కేసు విషయంలో రాజీపడాలని మూడు నెలల నుంచి అడ్వకేట్లతో మంతనాలు చేయిస్తున్నారు. అయితే అమృత మాత్రం తండ్రి మాట వినకపోవడంతో.. డిప్రెషన్‌లోకి వెళ్లాడు. అమృతను ఎలాగైనా కలవాలని మిర్యాలగూడకు చెందిన వారితో కూడా రాయబారం పంపాడు. కానీ, అమృత మాత్రం ఏమాత్రం మెట్టు దిగలేదు. దాంతో కూతురు ఇక తన మాట వినదని నిర్ణయించుకోని ఆత్మహత్య చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాడుఇక మారుతీరావు గదిలో ఆత్మహత్య ఆనవాళ్లు లభించలేదు. పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలోనూ ఎలాంటి ఆనవాళ్లు బయటపడలేదు. మరోవైపు ఆయన బస చేసిన గదిలో పాయిజన్‌ కానీ పురుగుల మందు డబ్బా కానీ పోలీసులకు లభించలేదు. శనివారం సాయంత్రం 6.50 నుంచి 9 గంటల వరకూ ఏం జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మారుతీరావు నిన్నఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకు ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌కు వచ్చారు. కొద్దిసేపటి తర్వాత ఆయన బయటకు వెళ్లి వచ్చారు. గదిలోకి వచ్చిన తర్వాత కారు డ్రైవర్‌ను పంపించి గదిలోకే అల్పాహారంగా గారెలు తెప్పించుకున్నారు. అనంతరం డ్రైవర్‌ను కిందకు పంపించేసి, గదికి గడియ పెట్టుకున్నారు. మారుతీరావు ఎంతకీ తలుపు తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఆయన గది తలుపులు బలవంతంగా తీసి చూడగా మంచంపై అచేతనంగా పడి ఉన్నారు. గదితో పాటుగా  వాష్ రూమ్ , బాత్రూంలో మారుతీరావు వాంతులు చేసుకున‍్నారు.సంఘటనా స్థలంలో లభించిన సూసైడ్‌ నోటులో ఉన్న చేతి రాతపై సాంకేతిక కోణంలో దర్యాప్తు చేపట్టారు. బయటికి వెళ్లిన మారుతీరావు ఎవరిని కలిశారు, ఎక్కడికి వెళ్లారు అన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. అలాగే ఆయన ఫోన్‌ కాల్స్‌ డేటా ఆధారంగా విచారణ జరుపుతున్నారు. ఓ వైపు ప్రణయ్‌ హత్యకేసు ట్రయల్‌కు రావడంతో మారుతీరావు తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. మరోవైపు కొంతకాలంగా కుటుంబంలో గొడవల కారణంగా ఆయన మనస్తాపం చెందినట్లు సమాచారం. 

Related Posts