YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

ఉన్నత విద్యపై సీఎం సమీక్ష

ఉన్నత విద్యపై సీఎం సమీక్ష

ఉన్నత విద్యపై సీఎం సమీక్ష
అమరావతి మార్చ్ 9
 ఉన్నత విద్యపై ముఖ్యమంత్రి  వైయస్.జగన్ మోహన్ రెడ్డి సోమవారం సమీక్ష జరిపారు. కాలేజీ ఫీజులపై  రాష్ట్ర హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్  తన ప్రతిపాదనలను అందజేసింది. ముఖ్యమంత్రి మాట్లాడుతూ మంచి చదువులు పిల్లలకు భారం కాకూడదు, ప్రభుత్వానికి కూడా భారం కాకూడదు.మనం రూపొందించుకునే విధానాలు.. దీర్ఘకాలం అమలు కావాలి. ఫీజు రియింబర్స్మెంట్ ఎప్పటికప్పుడు చెల్లింపునకు సిద్ధంగా ఉన్నాం. గత ఏడాది బకాయిలతోపాటు ఈ ఏడాది మూడు త్రైమాసికాలకు సంబంధించి, ప్రభుత్వం తరఫున చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. మార్చి 30 కల్లా చెల్లింపులు చేయాలని ముందడుగు వేస్తున్నాం. దీంతోపాటు ప్రతి విద్యాసంవత్సరంలో త్రైమాసికం పూర్తికాగానే ఫీజురియంబర్స్మెంట్ చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎప్పటికప్పుడు చెల్లింపుల వల్ల కాలేజీలకూ మంచి జరుగుతుంది.  అందుకే సస్టెయిన్బుల్ ఫీజు విధానం ఉండాలి. ప్రమాణాలు పాటించని కాలేజీలపై కఠిన చర్యలు ఉండాల్సిందే. ఉన్నత విద్యా వ్యవస్థలో నాణ్యతకు పెద్దపీట వేయాలని సీఎం సూచించారు. ఈ కార్యక్రమంలో హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ కె హేమచంద్రారెడ్డి, హయ్యర్ ఎడ్యుకేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర. పాల్గోన్నారు.

Related Posts