YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

కేంద్ర స్థాయిలో చంద్రబాబుకు పార్టీల మద్దతే లేదు

Highlights

  • అవిశ్వాస తీర్మానంపై చర్చకు  సిద్ధం 
  • అన్నాడీఎంకే బాధ్యత చంద్రబాబుదే 
  • కేంద్ర నిధులపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరగాలి
  • బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు స్పష్టికరణ 
కేంద్ర స్థాయిలో చంద్రబాబుకు పార్టీల మద్దతే లేదు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఇప్పుడు  తిప్పడానికి చక్రం లేదని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. కేంద్ర స్థాయిలో అయనకు పార్టీల మద్దతు లేదని చెప్పారు. తొలుత పార్లమెంట్ లో ఆందోళన మొదలుపెట్టి ఇతర పార్టీల ఆందోళనలకు టీడీపీ మార్గదర్శకమైందని విమర్శించారు. కేంద్రం ఏపీకి ఇచ్చిన నిధుల వినియోగంపై క్షేత్రస్థాయిలో నిజనిర్ధారణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆ నిధులను దేనికోసం   ఖర్చుచేశారో ప్రజలకు లెక్క చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందని స్పష్టం చేశారు. ఏదిఏమైనా ఈ విషయమై క్షేత్ర స్థాయిలో పరిశీలన ద్వారా ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు.కేంద్రానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే అన్నాడీఎంకేతో చర్చించే బాధ్యత చంద్రబాబు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ పార్టీలతో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని చెబుతున్న చంద్రబాబు, కేసీఆర్ లు పొరుగు రాష్ట్ర ప్రాంతీయ పార్టీల నేతలతో మాట్లాడలేరా? అని నరసింహారావు ప్రశ్నించారు.

Related Posts