YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నెల్లూరు గూడూరు కావలి బుచ్చి కలలో ఎన్నికలకు బ్రేక్

నెల్లూరు గూడూరు కావలి బుచ్చి కలలో ఎన్నికలకు బ్రేక్

 నెల్లూరు గూడూరు కావలి బుచ్చి కలలో ఎన్నికలకు బ్రేక్
 అధికారికంగా వెల్లడించిన ఎన్నికల కమిషన్
నెల్లూరు మార్చ్ 9
ఈ నెల లో జరగనున్న నగరపాలక ఎన్నికల లో గూడూరు నెల్లూరు కావలి బుచ్చి తదితర మున్సిపాలిటీలలో ఎన్నికలకు బ్రేక్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. విలీన సమస్యలు, కోర్టు వ్యాఖ్యలు, పూర్తికాని వార్డుల విభజన తదితర కారణాల వలన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్, గూడూరు మున్సిపాలిటీ, కావలి మున్సిపాలిటీ, బుజ్జి మున్సిపాలిటీలలో ఎన్నికలకు బ్రేక్ పడింది. ఆయా ప్రాంతాలలో ఎన్నికలు నిర్వహించడం లేదని సోమవారం రాష్ట్ర అ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ప్రకటించారు.ఈ వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్ సైట్ లో తెలియజేశారు. నెల్లూరు నగర పాలక సంస్థలో వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ సరిగా జరగలేదని మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వరీ ప్రసాద్ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు దానిపై స్టే విధించింది. 60 రోజుల్లోపూ ఆ ప్రక్రియను పూర్తి చేసి అప్పుడు ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టాలని కోర్టు ఆదేశించింది. గూడూరు, కావలి మున్సిపాల్టీలకు సంభందించి గతంలో ఆయా మున్సిపాల్టీలలో పలు గ్రామాలను విలీనం చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. విలీనం వద్దంటూ ఆ రెండు మున్సిపాల్టీలలో పలు గ్రామాల ప్రజలు హైకోర్టును ఆశ్రయించారు. వాటిపై కోర్టు స్టే మంజూరు చేసింది. ఇక పోతే బుచ్చిరెడ్డిపాళెం మేజర్ పంచాయితీని ఇటీవలే ప్రభుత్వం నగర పంచాయితీగా మార్చి దానికి కమీషనర్ ను కూడా నియమించింది. అయితే అక్కడ వార్డుల విభజన ఇంకా పూర్తి కాలేదు. దీంతో ఈ నాలుగు ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. వాటిపై న్యాయపరంగా ముందుకెళ్తేందుకు సమయం లేకపోవడంతో వాటిని మినహాయించి మిగిలిన ఆత్మకూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి మున్సిపాల్టీలలో మాత్రమే ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ వివరాలను ఎన్నికల కమిషన్ కు నివేదించింది. దీనిపై సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టతనిచ్చింది. జిల్లాలోను ఆత్మకూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట మున్సిపాల్టీలకు మాత్రమే ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు అధికారికంగా తెలియజేసింది.

Related Posts