YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రామ్ కుమార్ రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరిన పాపా రెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి

రామ్ కుమార్ రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరిన పాపా రెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి

రామ్ కుమార్ రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరిన పాపా రెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి
నెల్లూరు  మార్చ్ 9
వాకాడు మండలం, గోళ్లపాలెం గ్రామానికి చెందిన మాజీ జిల్లా టెలికాం బోర్డు సభ్యులు, టీడీపీ నేత పాపా రెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి సోమవారం వాకాడు లోని నేదురుమల్లి స్వగృహంలో  తిరుపతి, బాపట్ల పార్లమెంట్  వ్యవహారాల నియోజకవర్గ ఇంచార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి సమక్షంలో  టీడీపీకి గుడు భాయ్ చెప్పి ,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.పాపారెడ్డి కి పార్టీ కండువా కప్పి గౌరవ ప్రధంగా పార్టీలోకి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పాపా రెడ్డి అభిమానులు సంబరాలు చేసుకున్నారు.పాపా రెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రస్థానం  దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి దగ్గర నుండే మొదలయింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో  క్రమశిక్షణ గల నేతగా ఎదిగి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, రాజ్యలక్ష్మి దంపతులకు కుడి భుజంగా నిలిచారు, కొన్ని అనివార్య కారణాల రీత్యా నేదురుమల్లి కుటుంబానికి దూరం అయ్యి తనకంటూ ఒక్క సొంత వర్గాన్ని ఏర్పరచుకొని 2010 లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి తిరుగులేని నేతగా ఎదిగారు  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తెరుగులేని నేతగా ఎదుగుతున్న నేపథ్యంలో 2014 లోవచ్చిన స్థానిక సంస్థ ఎన్నికల్లో వాకాడు మండలంలో  పాపా రెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి తన సత్తా చాటారు, జెడ్పిటిసి, మండల పరిషత్ అధ్యక్ష పీఠం, ఎంపిటిసి, సర్పంచ్ పదవులు సాధించి మండలంలో తన సత్తా చాటారు. 2016 లో  అధికార టీడీపీ పార్టీలో పాపా రెడ్డి 2014  శాసన సభ, పార్లమెంటు ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గ పరిధిలో వైసీపీ తరుపున ప్రచారాలు చేసి,తన సొంత నిధులు ఖర్చు చేసి గూడూరు వైసీపీఎమ్మెల్యే  అభ్యర్థి అయినా పాశం సునీల్ కుమార్ గెలుపుతో పాపా రెడ్డి కీలకపాత్ర పోషించారు, స్థానిక సంస్థ ఎన్నికల్లో  సత్తా చూపించారు,దురదృష్టవశాత్తు వైసీపీ ఓటమి పాలు అవ్వడంతో 2016 లో గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ రెడ్డితో పాటు పాపా రెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి, పాపా రెడ్డి పురుషోత్తం రెడ్డి, దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి,సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి వైసీపీ కి గుడ్ భాయ్ చెప్పి అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు, మూడు సంవత్సరాలు పాటు వాకాడు మండలం లో నా మాటే శాసనం లా పాపా రెడ్డి చక్రం తిప్పారు, 2019 ఎన్నికల్లో టీడీపీ గోర పరాజయం పొందింది, అప్పటి నుండి మనోజ్ కుమార్ రెడ్డి టీడీపీకి దూరంగా ఉన్నారు,ఈ పరిస్థితిలలో  నేదురుమల్లి సమక్షంలో వైసీపీలో పాపా రెడ్డి చేరి అందరిని ఆశ్చర్య పరిచారు,  పాపా రెడ్డిలు దూరం వల్ల టీడీపీకి తీరని నష్టం 2019 లో టీడీపీ ఓటమి చెందడంతో టీడీపీలో ఉన్న నేతలు ఎన్నికలకు ముందు నుండే వైసీపీలోకి వలస వెళ్లారు, దింతో ఇప్పటికే గూడూరు నియోజకవర్గ పరిధిలోని అన్నీ గ్రామ,మండలాల్లో టీడీపీకి బలమైన నేతలు కరువయ్యారు, ఈ పరిస్థితులలో ఇటీవల టీడీపీ నేత పాపా రెడ్డి పురుషోత్తం రెడ్డి బీజేపీ లో చేరారు, ఇప్పుడు మనోజ్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరారు,దింతో స్థానిక సంస్థ ఎన్నికల్లో టీడీపీకి తీరని లోటు ఏర్పడింది.

Related Posts