YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ దేశీయం

మహిళా బిల్లులో బి.సి మహిళలకు సబ్ కోటా కల్పించాలి

మహిళా బిల్లులో బి.సి మహిళలకు సబ్ కోటా కల్పించాలి

 

మహిళా బిల్లులో బి.సి మహిళలకు సబ్ కోటా కల్పించాలి
         బి.సి మహిళ సంఘాల సమావేశం డిమాండ్
హైదరాబాద్ మార్చ్ 9 
పార్లమెంట్ లో మహిళా బిల్లు పెట్టి మహిళలకు చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అలాగే  మహిళ బిల్లులో బి.సి. మహిళలకు సబ్ కోటా కల్పించినప్పుడే బి.సి. మహిళల కు  రాజ్యాధికారం దక్కుతుంది అని  జాతీయ బీసీ సంఘం అద్యక్షులు ఆర్.కృష్ణయ్య అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని బీసీ మహిళా జాగృతి,బీసీ మహిళా ఐఖ్యవేదిక, బి.సి మహిళ సంఘం, సంయుక్త ఆద్వర్యం లో  బీసీ భవన్ కొ జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య  అతిది గా  విచ్చేసి  ప్రసంగించారు. పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే మహిళ బిల్లులో బి.సి. మహిళలకు జనాభా ప్రకారం సబ్-కోటా ఇవ్వాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. మహిళ బిల్లులో బి.సి మహిళలకు ప్రాతినిధ్యం కల్పించకపోతే మహిళ బిల్లుకు సార్ధకత లేదన్నారు.  ఇప్పటికే మహిళ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. లోక్ సభలో కూడా పెట్టి పూర్తి చేయాలని కోరారు.సమావేశానికి అద్యక్షత వహించిన బీసీ మహిళా జాగృతి జాతీయ అధ్యక్షురాలు బీసీ సంఘం రాష్ట్ర మహిళా ప్రదాన కార్యదర్శి ఆలం పల్లి లత మాట్లాడుతూ );: సమాజం ప్రగతి పథంలో పయనించాలంటే మహిళలు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఎంతయినా ఉందని మహిళా జాగృతి రాష్ట్ర అద్యక్షురాలు ఆలం పల్లి లతా  అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా జాగృతి ఆద్వర్యం లోమహిళా చైతన్య సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. సమాజం ప్రగతి పధంలో పయనించాలంటే మహిళలు విద్యావంతులై, ఉన్నపదవులు ఆధిరోహించాలన్నారు. మహిళలు ముఖ్యంగా విద్యా, ఆరోగ్యం, కేరీర్‌పై దృష్టిపెట్టి లక్ష్యసాధనకు కృషి చేయాలన్నారు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. ప్రస్తుత సమాజంలో మార్పు తీసుకు వచ్చే విధంగా మహిళల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు. మహిళ విద్యావంతురాలయితేనే కుటుంబంతో పాటు సమాజం బాగుంటుందని అన్నారు. మహిళలు నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలంటే చట్టసభల్లో మహిళలకు సమాన ప్రాతినిధ్యం కల్పించినప్పుడే ఇది సాధ్యమవుతుందని అన్నారు.బీసీ ఐఖ్యవేదిక రాష్ట్ర మహిళా అద్యక్షురాలు విజయ లక్ష్మి మాట్లాడుతూ మహిళా బిల్లు గురించి గొంతులు చించుకొని మాట్లాడే రాజకీయ పార్టీల నాయకులు బి.సి మహిళల గురించి, వారికి జరుగుతున్న అన్యాయాల గురించి, అత్యాచారాల గురించి  ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తున్నాం. బి.సి.లంటే చిన్న చూపా? అసెంబ్లీ లో మొక్కుబడిగా తీర్మాణం చేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? అని ఆయన ప్రశ్నించారు. మహిళ బిల్లు పాస్ కావాలంటే బి.సి మహిళలకు సబ్-కోటా ఇవ్వక తప్పదు. జనాభాలో సగం ఉన్న బి.సి.మహిళలకు కోటా ఇవ్వకుండా మహిళల గురించి మాట్లాడటం అన్యాయమన్నారు.కూకట్ పల్లి సుగుణ మాట్లాడుతూ మహిళలకు రక్షణ కోసం ఇప్పటికీ అనేక చట్టాలు ముఖ్యంగా వరకట్న నిషేద చట్టం ,అత్యాచార, నిరోధక చట్టం ,నిర్భయ చట్టం ,బాల్య వివాహాల నిరోధక చట్టం, దిశా చట్టం లాంటి 19 చట్టాలు వచ్చిన్నపటికి వారి పై అత్యాచారాలు తగ్గలేదు .పురుశాదిక్యత తగ్గలేదు మహిళల రక్షణ కోసం మరిన్ని చట్టాలు తేవలసిన ఆవసరం కుఉందన్నారు. మహిళలను చైతన్యం చేయాలి. అధికారంలో వాటా ఇవ్వాలని కోరారు.సంపూర్ణ మద్యపాన నిషేధం విదించినపుడే మహిళా ప్రగతి జరుగుతుంది. మహిళలపై అత్యాచారాలు తగ్గుతాయి. మద్యపానాన్ని నిషేదించాలని అందులో మొదటి దశలో  బెల్టుషాపులు ఎత్తివేయాలని జాతీయ రహదారులు ప్రధాన రహదారిలో పక్కన ఉన్న మద్యం దుకాణాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు అలాగే రాత్రి ఏడు గంటల తర్వాత మద్యం దుకాణాలు మూసి వేయాలని కోరారు డ్రగ్స్ను పూర్తిగా మార్కెట్ నుంచి తొలగించాలని కోరారు.మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మద్యపాన నిషేధం విదించాలని పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బీసీ సంఘం నాయకురాలు రేణుకా మాట్లాడుతూఅలాగే అత్యాచారాలు, హత్యలకు సినిమా రంగం కూడా తోదవుతుందన్నారు. సినిమాలలో అసభ్యకర అంశాలు ముఖ్యంగా నగ్న, అర్థనగ్న, సెక్స్ దృశ్యాలు పూర్తిగా నిషేధించాలని కోరారు. కొన్ని సీరియల్స్, సోషల్ మీడియాలు కూడా వ్యాపార దృక్పథంతో సెక్స్ ప్రేరేపించే దృశ్యాలు ,మాటలు, డైలాగులను కొనసాగిస్తున్నారని వీటిని తొలగించాలని కోరారు.మరో నాయకురాలు సుగుణ మాట్లాడుతూఅట్టడుగు స్థాయి ప్రేక్షకులకు ముఖ్యంగా యువత సినిమా ప్రభావంతో ఒంటరి మహిళలపై అత్యాచారాలకు పాల్పడే స్థాయికి  దృశ్యాలు పురిగొల్పు తున్నాయి నేటితరం సినిమాలు. సెక్సు సినిమాలు, నగ్న-అర్ధ నగ్న దృశ్యాలు యువతను  చెడుదారి పట్టిస్తుందని విమర్శించారు. అనంతరం కృష్ణయ్య మహిళా నేతలను శాలువాలతో ఘనంగా సన్మానించ్శారు.ఈ కార్యక్రమంలో మహిళా జాగృతి నాయకురాళ్ళు,సమిత,రాణి,నీలా వెంకటేష్ ,రామ్ కోటి జి.కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.

Related Posts