Highlights
- తన చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ నోట్
‘‘నా చావుకు ఎవరూ కారణం కాదు.. నా మెదడే నా శత్రువు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను’’ అంటూ ఓ ప్రముఖ యాంకర్ రాధిక (30) ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు.తెలుగు టీవీ చానల్‌లో న్యూస్ యాంకర్‌గా పనిచేస్తున్న ఆమె గత ఐదేళ్లుగా హైదరాబాద్, ముసాపేట గూడ్స్ షెడ్ రోడ్డులోని సుశీల్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. ఆ అపార్టుమెంట్ ఐదో అంతస్తు పైనుంచి దూకి ఆమె ఈ ఆత్మహత్య చేసుకున్నారు. పరుగుపరుగున అపార్ట్‌మెంట్ పైకి వెళ్లడాన్ని ఇరుగుపొరుగు వారు గమనించారు. కీడు శంకించి వారు పైకి వెళ్లేలోపే ఆమె పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆరు నెలల కిందట భర్తతో విడాకులు తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం తండ్రి, చెల్లెలు, కుమారుడితో కలిసి ఉంటున్నారు. భర్త దూరం కావడంతో కొన్నాళ్లుగా తీవ్ర మానసిక ఒత్తిడి లోనైన రాధిక ఈ అఘాహిత్యానికి పాల్పడినట్టుగా స్థానికులు పేర్కొంటున్నారు. కాగా మానసిక ఒత్తిడి భరించలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.