YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

మారుతీరావు కేసులో ట్విస్టులే...ట్విస్టులు

మారుతీరావు కేసులో ట్విస్టులే...ట్విస్టులు

 మారుతీరావు కేసులో ట్విస్టులే...ట్విస్టులు
నల్గొండ,మార్చి 9 
మారుతీ రావు అంత్యక్రియలు పూర్తయ్యాక మీడియా ముందుకొచ్చిన అమృత.. తన బాబాయి శ్రవణ్‌ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. ప్రణయ్‌ను హత్య చేయించింది మారుతీ రావు కావచ్చు.. కానీ ఆ హత్యకు ప్రేరేపించింది మాత్రం శ్రవణ్ అనే అర్థం ధ్వనించేలా ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మారుతీరావును శ్రవణ్ కొట్టారని కూడా తనకు తెలిసిందన్న ఆమె.. ఈ విషయం మిర్యాలగూడలో చాలా మందికి తెలుసని, కానీ ఎవరూ మాట్లాడరని వ్యాఖ్యానించడం గమనార్హం. మారుతీ రావు ఆత్మహత్య చేసుకున్నారని నమ్ముతున్నానని చెప్పిన ఆమె.. ప్రణయ్ కేసు ఒత్తిడితోనే ఆయన ఈ దారుణానికి పాల్పడ్డారని అనుకోవడం లేదన్నారు. బహుశా శ్రవణ్ ఒత్తిడి కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చాన్నారు. శ్రవణ్ అంటే మారుతీ రావు భయపడతారని.. ఇంట్లో అందరూ శ్రవణ్ మాటే వింటారని ఆమె వ్యాఖ్యానించారు. శ్రవణ్‌ లక్ష్యంగా ఆమె ఆరోపణలు గుప్పించగా.. మారుతీరావు సోదరుడు కూడా ఆమె విమర్శలకు సమాధానం ఇచ్చారు. తనకు మారుతీరావు సంపాదనలో నుంచి ఒక్క పైసా అవసరం లేదన్నారు.మారుతీరావుకు ఆస్తి వివాదాలు ఎప్పటి నుంచో ఉన్నాయన్న అమృత.. ఆయనకు బినామీ ఆస్తులు ఉన్నాయని తెలిపారు. తండ్రి చనిపోతే.. ఆనందించిందని నన్ను అంటున్నారు సరే.. మరి శ్రవణ్ ముఖంలో బాధ కనిపించిందా అని ఆమె ప్రశ్నించారు. శ్మశానానికి వెళ్లిన తనను శ్రవణ్ కూతురు.. నెట్టివేసిందన్నారు. తనకు ప్రాణహాని ఉందని అనుకోవడం లేదు గానీ.. తన తల్లికి మాత్రం ప్రాణ ఉందని అనుకుంటున్నానని అమృత తెలిపారు. ఆమె వ్యాఖ్యలను నిశితంగా పరిశీలిస్తే.. తన భర్తను చంపారనే కోపం తప్పితే.. ఆ కుటుంబంపై ఎలాంటి కోపం లేదంటూనే.. బాబాయి శ్రవణ్‌ విషయంలో మాత్రం ఆమె తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ విమర్శలకు శ్రవణ్ కూడా అదే రీతిలో బదులిచ్చారు.మారుతీరావును తాను కొట్టానని అమృత చేసిన ఆరోపణలను శ్రవణ్ ఖండించారు. తాను మారుతీ రావును కొట్టలేదు, తిట్టను కూడా తిట్టలేదని ఆయన తెలిపారు. తండ్రి చనిపోయాక.. బాబాయి చావాలని కోరుకుంటున్న క్యారెక్టర్లను పెంచి పోషించొద్దన్నారు. పైన భగవంతుడు ఉన్నారన్న ఆయన.. కేసు విషయంలో కాంప్రమైజ్ కావాలని ఆమెను అడగబోనన్నారు. కోర్టు శిక్ష విధిస్తే అనుభవించేందుకు సిద్ధమన్నారు. ‘‘నీ బిడ్డను సరిగా పెంచకపోవడం వల్ల.. నేను కూడా జైలుకు వెళ్లాల్సి వచ్చింది.. నా పిల్లలూ పెద్దోళ్లు అయ్యారు, చదువుకుంటున్నారు, నీతో నాకొద్దు. వ్యాపార పరంగా వేరు పడదాం. లేదంటే పిల్లల పెళ్లిళ్లకు ఇబ్బంది అవుతుందని పెద్ద మనుషుల ద్వారా మాట్లాడించాను. మే 15 నుంచి ఇప్పటి వరకూ మారుతీరావుతో నేను మాట్లాడలేదు’’ అని శ్రవణ్ మీడియాకు వివరించారు.ఎవరి నుంచో తనకు ముప్పు ఉందనే భావనతో మారుతీరావు వీలునామా రాశారని శ్రవణ్ తెలిపారు. మారుతీరావుకు సంబంధించిన ఒక్క పైస కూడా తనకు అవసరం లేదన్నారు. ఈ రోజు అంత్యక్రియలను నేను నిర్వహించాను.. కానీ మనసు చంపుకోని చేయలేదన్నారు. అమృతకు మెచ్యూరిటీ లేదన్న ఆయన.. మారుతీరావు మరణవార్త నాకు శుభవార్త అని ఆమె అందన్నారు. సంప్రదాయ ప్రకారం భర్త చనిపోయాక తాళి తీయాలి కానీ.. మారుతీరావు భార్య తాళి తీసిన రోజే నేను తీస్తానని అమృత వ్యాఖ్యానించిందని శ్రవణ్ ఆరోపించారు. ‘‘ఈరోజు ఆమెకు మారుతీరావు మీద, ఆయన భార్య మీద ప్రేమ ఎలా వస్తుంది..? నాన్న మీద ప్రేమ ఉంటే నిన్నే రావచ్చు కదా..? నాన్న అని ఏడవడానికి నిన్న రావచ్చు కదా. ఆస్తి కోసం డ్రామాలు వేస్తోంది. ప్రేమ ఉంటే.. తల్లి భర్త చనిపోవాలని కోరుకుంటుందా?’’ అని శ్రవణ్ ప్రశ్నించారు.‘మారుతీరావు ఎంత ప్రేమగలవాడు అని చెప్పడానికి ఆయన రాసిన సూసైడ్ నోటే నిదర్శనం. తాను చనిపోయి కూడా.. తన ప్రేమను బతికించుకున్నాడు. అమ్మ దగ్గరికి వెళ్లు అమృత అని రాశాడు. అంత బ్రహ్మాండమైన తండ్రిని దూరం చేసుకున్న ఆమె దురదృష్టవంతురాలు. ఒక్కసారి కూడా అమృతను ఆయన మందలించడాన్ని మేం చూడలేదు. నిన్ను ఎప్పుడైనా మీ నాన్న తలతిరుగుందా అంటే చూడాలని ఉంది అమ్మూ.. అని మేం సరదాగా అనేవాళ్లం. అలాంటి వ్యక్తి ప్రేమను అమృత కోల్పోయింది. ఈరోజు దొంగ ప్రేమ ఎందుకు? తప్పు ఎవరైనా చేస్తారు. ఆమె వచ్చి ఉంటే మారుతీరావు చనిపోయేవాడు కాదు. చట్టానికి ఎవరం అతీతులం కాదు. చేసిన కర్మను అనుభవించాల్సిందే’’ అని శ్రవణ్ వ్యాఖ్యానించారు.‘‘బినామీల పేరిట ఆస్తులు ఉన్నాయని అమృత చెబుతోంది. కానీ మారుతీరావు ఆయన మా కుటుంబీకులు నలుగుర్ని తప్పితే ఎవర్నీ నమ్మడు. చిన్నతనం నుంచి అమృతకు నేనంటే ఎందుకు కోపం అంటే.. బిడ్డపై ఆయన ఎప్పుడూ అరవడు. ఆయనకు ఇష్టం లేని పని చేస్తే.. బాబాయి ఒప్పుకోడు, బాబాయి అరుస్తాడు అని నా పేరు అడ్డు వేసేవాడు. దీంతో అమృత దృష్టిలో బాబాయి విలన్‌గా మారిపోయాడు. నాకు కూడా ముగ్గురు పిల్లలున్నారు. తనతో నేనెందుకు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తాను. తండ్రిగా ఆయన కోప్పడలేక.. బాబాయికి ఇష్టం ఉండదని ఆయన చేసిన వ్యాఖ్యల వల్లే ఇలా అయ్యింది. అమృతను మారుతీరావును విడగొడితే ఆ దేవుడు చూడడా..’’ అని శ్రవణ్ వాపోయారు.‘ఆర్థికంగా మాకు ఎలాంటి సమస్యలు లేవు. నాకు తెలియకుండా మా అన్న ఎవరి దగ్గరా డబ్బులు తెచ్చిన దాఖలు ఏవీ లేవు. ఒకవేళ గతంలో లేదా కేసు అయిన తర్వాత ఎవరైనా ఆయనకు డబ్బులు ఇచ్చి ఉంటే.. వాళ్లను నా దగ్గరకు రమ్మనండి.. వాళ్లకు నూరు శాతం వడ్డీతో సహా ఇచ్చేస్తాను. ఒక తమ్ముడిగా ఆ బాధ్యత నాది. కావాలనే పుకార్లను వ్యాపింపజేస్తున్నారు. కోర్టులో వకీలుకు ఇచ్చే రూ.10-20 లక్షలు ఇచ్చేందుకు డబ్బులు లేని పరిస్థితి మాకు ఎప్పుడూ లేదు. గత 30 ఏళ్లుగా భూములు కొనుగోలు చేస్తున్నాం. అందరి భూముల ధరలతోపాటు మా భూముల ధరలు పెరిగాయి. మాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు, వ్యాపారం మీదే శ్రద్ధ పెట్టాం కాబట్టి.. బాగా సంపాదించగలిగాం’’ అని శ్రవణ్ తెలిపారు.

Related Posts