YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కమల్ కు కమలం ఎఫెక్ట్

కమల్ కు కమలం ఎఫెక్ట్

 కమల్ కు కమలం ఎఫెక్ట్
భోపాల్, మార్చి 10,
కమలం పార్టీ దెబ్బకు కాంగ్రెస్ కకావికలమవుతోంది. ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కష్టంగానే ఉంది. రాజ్యసభ ఎన్నికల్లోపే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జారి పోయే అవకాశముంది. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తుండటంతో హస్తం పార్టీలో ఆందోళన నెలకొంది. కమల్ నాధ్ కూడా నిత్యం ఎమ్మెల్యేలతో టచ్ లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. క్యాంపులు పెట్టాలన్నా దాదాపు ఇరవై రోజులు ఉండటంతో ఎక్కువ సమయం అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.మధ్యప్రదేశ్ లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. ఇటు రాష్ట్రంలో అధికారంతో పాటు రాజ్యసభ స్థానాలను కూడా కైవసం చేసుకోవాలని నిర్ణయించింది. అందుకోసమే ఎమ్మెల్యేలతో కమలం పార్టీ పెద్దలు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. బీజేపీకి చెందిన జాతీయ స్థాయి కీలక నేత ఒకరు కాంగ్రెస ఎమ్మెల్యేలతో టచ్ లోకి వచ్చారని చెబుతున్నారు. కర్ణాటకలో సక్సెస్ కావడంతో అసంతృప్తిగా ఉన్న కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సయితం పార్టీని వీడి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట.అయితే వీరిలో పదవులు కోల్పోవడానికి సిద్ధపడిన వారికే బీజేపీ ప్రయారిటీ ఇస్తుందంటున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేస్తుంది. విప్ ను థిక్కరించి ఓటు వేస్తే అనర్హత వేటు పడుతుంది. అయితే రాజ్యసభ ఎన్నికల తర్వాత కొందరు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలన్న యోచనలో ఉంది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యలతో సుప్రీంకోర్టును ఆశ్రయించి ఉప ఎన్నికల్లో వారిని తిరిగి గెలిపించాలన్న వ్యూహరచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు వస్తే చాలు. ఇప్పటికే బీఎస్పీ, స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో మ్యాజిక్ ఫిగర్ ను చేరుకుని మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం పెద్ద కష్టమేమీ కాదని భావిస్తుంది. ఈ ఆలోచన తెలిసి కాంగ్రెస్ లో కలవరం బయలుదేరింది. కాంగ్రెస్ అగ్రనేతలందరూ ప్రస్తుతం మధ్యప్రదేశ్ పైనే దృష్టి పెట్టారు. మరి కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను కాపాడుకోగలుగుతుందా? లేదా? అన్నది చూడాలి.

Related Posts