YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

 కరోనా నియంత్రణకు బల్దియా చర్యలు

 కరోనా నియంత్రణకు బల్దియా చర్యలు

 కరోనా నియంత్రణకు బల్దియా చర్యలు
హైద్రాబాద్, మార్చి 10
కరోనా వైరస్ కట్టడికి బల్దియా మరిన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది.  ముందు జాగ్రత్తలు పాటిద్దాం, కరోనా వైరస్ వ్యాప్తిని అరికడదాం, కరచాలనం వద్దు, స్వచ్ఛ నమస్కారం చేద్దాం అంటూ ఇందుకు సంబంధించి నగర వ్యాప్తంగా ప్రత్యేకంగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని సర్కిల్ ఆఫీస్‌ల్లో సైన్ బోర్డులతో పాటు స్టిక్కర్లను అంటించారు. అదేవిధంగా నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం ప్రత్యేకంగా ప్లెక్సీలు స్టిక్కర్లును ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా తెలుగు, ఇంగీషు, ఉర్ధూ భాషాల్లో కరపత్రాలను ముద్రించి పంపిణీ చేపట్టారు.కరోనా వైరస్ నేపథ్యంలో జిహెచ్‌ఎంసిలోని హెల్త్ విభాగం అప్రమత్తమైంది. నగర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రజలకు కరోనా వైరస్ పట్ల అవగాహణ కల్పిం చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఒకవైపు కర పత్రాల ద్వారా ప్రచారం చేయడంతో పాటు చేత్త సేకరణకు ఆటోల ద్వారా సైతం కరోనా వైరస్ వ్యాప్తిని ఏలా అరికట్టవచ్చో వివరిస్తున్నారు. ఇందుకు సంబంధించి 36 సెకండ్ల నిడివి గల ఆడియోను ప్రత్యేక రూపొందించి ఆటోలకు ఉన్న మైక్ సెట్ల ద్వారా వినిపిస్తున్నారు. మరోవైపు బల్దియాలోని హెల్త్ విభాగం డాక్టర్ల బృందం సైతం నగర వ్యాప్తంగా పర్యాటిస్తూ వ్యాధిని నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తున్నారు. కరోనా సైతం స్వైన్‌ప్లూ లాంటిదేనని భయాపడాల్సిన అవసరం లేదని అది సోకకుండా ముందు జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని అవగాహన కల్పిస్తున్నారు.

Related Posts