వూహాన్ లో చైనా అధ్యక్షుడి పర్యటన
బీజింగ్ మార్చి 10,
కరోనా వైరస్ ప్రారంభమయిన వూహాన్ నగరంలో మొట్టమొదటిసారి మంగళవారం చైనా దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ పర్యటించారు. గత ఏడాది హుబే ప్రావిన్సు పరిధిలోని వూహాన్ నగరంలో కరోనా వైరస్ ప్రబలిన విషయం తెలిసిందే. తన పర్యటనలో కరోనా వైరస్ నియంత్రణకు వైద్యాధికారులు తీసుకున్న చర్యలను జిన్పింగ్ పరిశీలించారు. ఈ వ్యాధి కోసమే నిర్మించిన హోషెన్షాన్ ఆసుపత్రిని కుడా అయన పరిశీలించారు. ఈ వైరస్ నియంత్రణ కోసం శ్రమించిన వైద్యఆరోగ్యశాఖ కార్యకర్తలు, మిలటరీ అధికారులు, సైనికులు, కమ్యూనిటీ వర్కర్లు, పోలీసు అధికారులు, అధికారులు, వాలంటీర్లు, కరోనా వైరస్ రోగులు, వూహాన్ వాసులను జిన్ పింగ్ ప్రశంసించారు. జిన్ పింగ్ వెంట కమ్యూనిస్టు పార్టీ చైనా సెంట్రల్ కమిటీ సభ్యులు, సెంట్రల్ మిలటరీ కమిషన్ ఛైర్మన్ తదితరులున్నారు. దేశాధ్యక్షుడి పర్యటన తరువాత వూహాన్ నగరంలో విధించిన ఆంక్షలు సడలించే అవకాశాలున్నట్లు సమాచారం. కరోనా వైరస్ సోకి ఇంతవరకు చైనాలో 3136 మంది మృత్యువాత పడ్డారు. మంగళవారం నాటికి