రెండు గంటలు ఆలస్యంగా పరీక్షా పత్రాలు
తీవ్ర మనోవేదనకు గురైన 23 మంది విద్యార్థులు
ఖమ్మం మార్చి 10
ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలోని టిఎస్ఎస్ డబ్ల్యూఆర్ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ ఒకేషనల్ ప్రశ్నాపత్రాలు రెండు గంటలు ఆలస్యం కావడంతో విద్యార్థులు ఇబ్బందులు గురయ్యారు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కావలసిన పరీక్ష అధికారుల తప్పిదంతో స్థానిక పోలీస్ స్టేషన్లో కోడ్ మార్పు వల్ల పరీక్ష రాయాల్సిన పత్రాలకు బదులు వేరే ప్రశ్నాపత్రాలు రావటంతో అధికారులు సెంటర్ నుంచి మరల పోలీస్ స్టేషన్ కు వెళ్లి తీసుకొచ్చారు.ఈ రోజు జరిగే వర్క్ షాప్ టెక్నాలజీకి సంబంధించిన ప్రశ్నాపత్రాలు రెండు గంటల పాటు ప్రశ్నాపత్రాలు ఆలస్యం జరిగింది దీంతో పరీక్ష రాయాల్సిన 23 మంది విద్యార్థులు రెండు గంటల పాటు విద్యార్థులు పరీక్షా కేంద్రంలో ఖాళీగా నిరీక్షించాలిసి వచ్చింది. పదకొండు గంటల సమయంలో ఎగ్జామ్ సెంటర్ కి అధికారులు ప్రశ్నా పత్రాలు తీసుకువచ్చి విద్యార్థులకు పరీక్షా పత్రాలను అందజేశారు. దీనిపై పరీక్ష కేంద్రం ఇంచార్జీలను వివరణ కోరగా పోలీస్ స్టేషన్ల వద్ద కోడ్ మార్పు వల్ల పరీక్షా పత్రాలు మిస్టేక్ జరిగిందని దీనివల్ల రెండు గంటల పాటు పరీక్ష ఆలస్యమైందని విద్యార్థులకు మరో రెండు గంటల పాటు అవకాశం కల్పిస్తామని వారు తెలిపారు. దీంతో విద్యార్థులు పరీక్ష హాలులో తీవ్ర అసహానికి గురయ్యారు.