.jpg)
రాజధాని పేరుతో జగన్ భూవ్యాపారం:బిజెపి
విశాఖపట్టణంమార్చ్ 10
ఆంధ్రప్రదేశ్ లో రాజధాని పేరు తోనే రాజకీయాలు నడుస్తున్నాయని, గత ప్రభుత్వం సింగపూర్ అంటే ఈ ప్రభుత్వం సౌత్ ఆఫ్రికా అంటున్నదని బిజెపి నాయకుడు ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. గత తెలుగుదేశం హయాంలో అమరావతి లో రాజధాని పేరుతో భూ వ్యాపారం జరిగిందని ఇప్పుడు వై సి పి హయాంలో విశాఖ లో అదే జరుగుతోందని ఆయన అన్నారు. అందుకే ప్రత్యామ్నాయ పార్టీ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆ ప్రత్యామ్నాయం బిజెపి జనసేన అని ఆయన అన్నారు.అమరావతి భూముల్లో రోడ్లు భవనాలు నిర్మించేసి ఇప్పుడు రైతులకు భూములు తిరిగి ఇచ్చేస్తాం అంటే ఎలా అని మాధవ్ ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వస్తే దేశంలో ఎక్కడా ఇంత తక్కువ సమయంలో ఎన్నికలు జరగలేదని, కావాలనే రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేసిందని మాధవ్ అన్నారు. అయినా తాము స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.