అందంగా నవ్వుతూ ఎస్ బ్యాంకును కొల్లగొట్టారు
న్యూ ఢిల్లీ మార్చ్ 10
అందంగా నవ్వుతూ ఉన్నా ఈ ఐదుగురే ఎస్ బ్యాంకును కొల్లగొట్టారు. ఈ ఫొటోలో ఉన్నది రానా కపూర్ ఆయన భార్య బిందు కపూర్, వారి కుమార్తెలు రాధా కపూర్, రోష్నీ కపూర్, రాఖీ కపూర్. వీరందరిపైనా సీబీఐ చార్జి షీట్ దాఖలు చేసి విస్త్రతంగా తనిఖీలు చేపడుతున్నది.ఈ ఐదుగురు నివాసం ఉండే ఏడు ప్రాంతాలపై సీబీఐ దాడులు చేసింది. కపూర్, ఆయన కుటుంబ సభ్యులతో సహా, ఈ కుంభకోణంలో ఉన్న ఏడుగురు వ్యక్తులపై సీబీఐ సోమవారం కూడా లుకౌట్ సర్క్యులర్లు జారీ చేసింది. కపూర్ పై 7వ తేదీన ఒక ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.అప్పటి యస్ బ్యాంక్ సిఈఓ, డూయిట్ అర్బన్ వెంచర్స్ (కపూర్ కుటుంబ సభ్యలకు సంబంధించిన కంపెనీ), డిహెచ్ఎఫ్ఎల్, కపిల్ వాధ్వాన్ (డిహెచ్ఎఫ్ఎల్, ప్రమోటర్) లపై 120 (బి) (నేరపూరిత కుట్ర), 420 (మోసం) తో పాటు భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 7, 12, 13తో సిబిఐకి చెందిన ఎకనమిక్ నేరం వింగ్ (1) న్యూఢిల్లీలో ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. సిబిఐ ఎఫ్ఐఆర్ ప్రకారం, రాణా కపూర్ కపిల్ వాధవాన్ తో కలిసి ఈ నేరం చేశాడు.ఈ నేరపూరిత కుట్రతో తనకు తన భార్య కుమార్తెలకు రూ.600 కోట్లు ముడుపులు స్వీకరించాడు. 2018 ఏప్రిల్ నుంచి జూన్ కాలంలో, యస్ బ్యాంక్ డిహెచ్ఎఫ్ఎల్, స్వల్పకాలిక డిబెంచర్స్ లో రూ. 3,700 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇందుకోసం వాధవాన్ రూ. 600 కోట్లు రాణా కపూర్ కు, అతని కుటుంబ సభ్యులకు సంబంధించిన డూయిట్ అర్బన్ వెంచర్స్ కు బదిలీ చేశారు.ఈ కేసుకు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్బీఐ, ఇతర ప్రభుత్వ ఏజెన్సీలతో కూడా సిబిఐ టచ్ లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. యస్ బ్యాంక్ సంక్షోభానికి సంబంధించి దాఖలు చేసిన కేసులో నిందితుడిగా ఉన్న యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్ మొత్తం కుటుంబ సభ్యులను కూడా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) నిందితులుగా చేర్చింది. ఇప్పటికే ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ రాణా పై మనీలాండరింగ్ కేసు కూడా దాఖలు చేసింది.