YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కాంగ్రెస్ కు జ్యోతిరాదిత్య  సింధియా రాజీనామా

కాంగ్రెస్ కు జ్యోతిరాదిత్య  సింధియా రాజీనామా

కాంగ్రెస్ కు జ్యోతిరాదిత్య  సింధియా రాజీనామా
అయనపై బహిష్కరణ వేటు.. సోనియా ఆమోదం
భోపాల్ మార్చ్ 10
మధ్యప్రదేశ్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియాను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరిస్తున్నట్టు ఆ పార్టీ అధిష్ఠానం మంగళవారంనాడు ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ఏఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. సింధియా బహిష్కరణకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమోద ముద్ర వేసినట్టు పార్టీ ప్రతినిధి కేసీ వేణుగోపాల్ ఆ ప్రకటనలో తెలిపారు.అంతకుముందు నాటకీయ పరిణామాల నేపథ్యంలో మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్లిన జ్యోతిరాదిత్య కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో తొలుత సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆయనతో కలిసి నేరుగా ప్రధానమంత్రి నివాసానికి వెళ్లి ప్రధాని మోడీని కలిశారు. పిమ్మట కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపించి, దాన్ని ట్విట్టర్ ఖాతలో పోస్ట్ చేశారు. మధ్య ప్రదేశ్ లోని గుణ నియోజకవర్గంనుంచి అయన నాలుగు సార్లు పార్లమెంట్ కు ఎన్నికయ్యారు.  దాదాపు పద్దెనిమి ఏళ్లుగా కాంగ్రెస్ లో చురుకుగా వున్నారు. దీనికి ముందు మంగళవారం ఉదయం సింధియా నేరుగా ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. హోం మంత్రి అమిత్షా కూడా ఆయన వెంటనే ఉన్నారు. సుమారు గంటసేపు వీరు సమావేశమయ్యారు. అనంతరం సింధియా తన రాజీనామాను పత్రాన్ని సోనియాగాంధీకి పంపారు సింధియా ను కాంగ్రెస్ నుంచి బహిష్కరించగానే అయన వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు, పార్టీకి రాజీనామాలు చేసారు. వారిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన లేఖను తమ రాష్ట్ర గవర్నర్‌కు వారు పంపారు.మరో  ఆరుగురు ఎమ్మెల్యేలు కుడా రాజీనామాకు సిద్దమయ్యారని సమాచారం.  మధ్యప్రదేశ్ శాసనసభలో  మొత్తం 230 స్థానాలుండగా, కాంగ్రెస్ కు 120 సీట్లు వున్నాయి. మేజారిటీ మార్క్ 116 సీట్లు కాగా, బీజేపీకి 107 మంది ఎమ్మెల్యేలు వున్నారు. తాజా రాజీనామాతో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినట్లే

Related Posts