YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైఎస్సార్ కాంగ్రెస్ లోకి రఘువీరా రెడ్డి?

వైఎస్సార్ కాంగ్రెస్ లోకి రఘువీరా రెడ్డి?

 వైఎస్సార్ కాంగ్రెస్ లోకి రఘువీరా రెడ్డి?
విజయవాడ మార్చ్ 10
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ లో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ విభజన జరిగి ఏడేళ్లయినా కోలుకోలేకపోయింది. తాజాగా ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. అయితే ఇన్నాళ్లు పార్టీని నమ్ముకుని ఉన్న నాయకులు పార్టీలు మారేందుకు చూస్తున్నారు. మొన్నటి వరకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న మాజీమంత్రి నీలకంఠాపురం రఘువీరా రెడ్డి ఇప్పుడు జగన్ చెంతకు చేరనున్నట్టు తెలుస్తోంది. ఆయనకు పార్టీ మార్పుపై ఆసక్తి లేకున్నా వైఎస్సార్ తో ఉన్న అనుబంధంతో వైఎస్సార్సీపీలోకి ఆహ్వానం వచ్చింది. దీంతో ఆయన ఇష్టం లేకున్నా వైఎస్సార్సీపీలో చేరనున్నాడని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. జగన్ తో చర్చలు పూర్తయి ఆయన చేరిక లాంఛనమేనని తెలుస్తోంది. ప్రస్తుతం రాస్త్రం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. అనంతపురము జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి చెందిన రఘువీరారెడ్డిని చేర్చుకుంటే తమ పార్టీకి బలంతో పాటు వైఎస్సార్ కు ప్రధాన అనుచరుడుగా ఉన్న రఘువీరారెడ్డిని చేర్చుకుంటే గౌరవం ఇచ్చినట్లు ఉంటుందని వైఎస్ఆర్సీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రఘువీరారెడ్డిని ఎప్పటినుంచో పార్టీలోకి రావాలని జగన్ పార్టీ ఆహ్వానిస్తోంది. అయితే కాంగ్రెస్ కు నమ్మినబంటులా ఉన్న రఘువీరారెడ్డి వచ్చిన అవకాశాలన్నింటిని తిరస్కరించి ఆ పార్టీలోనే ఉంటున్నారు. అయితే తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రఘువీరారెడ్డిని ఎలాగైనా పార్టీలో చేర్చుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రఘువీరారెడ్డిపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఇన్నాళ్లుగా పిలుస్తుండడంతో ఇక వెళ్దామనే నిర్ణయానికి రఘువీరారెడ్డి వచ్చినట్లు సమాచారం. ఆయన అన్యమనస్కంగానే వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధమయ్యారంట. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మంతనాలు పూర్తయినట్లు తెలుస్తోంది.వైఎస్సార్ కుటుంబంతో రఘువీరా రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మాజీ సీఎం దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కుడిభుజంగా రఘువీరారెడ్డి వ్యవహరించారు. వైఎస్సార్ హయాంలో కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. వైఎస్సార్ హఠాన్మరణం అనంతరం రఘువీరా కాంగ్రెస్లోనే కొనసాగారు. రోశయ్య కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కొనసాగారు. రాష్ట్ర విభజన అనంతరం రాజకీయాలకు దూరమయ్యారు. మొన్నటివరకు ఏపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ అంత చురుగ్గా లేరు. రాజకీయాల నుంచి దాదాపుగా దూరమై ప్రస్తుతం వ్యక్తిగత పనులతో బిజీ అయ్యారు. తన తండ్రికి ఆప్తుడిగా.. వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న రఘువీరా రెడ్డిని తమ పార్టీలో చేర్చుకోవడానికి వైఎస్ జగన్ అమితాసక్తి కనబరుస్తున్నారు.అయితే వైఎస్సార్సీపీలో ఉన్న వారంతా రఘువీరారెడ్డి సహచరులే. ఆయన సన్నిహితులందరూ దాదాపుగా జగన్ పార్టీలో ఉన్నారు. బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాద రావు ఆనం రామనారాయణ రెడ్డి అంబటి రాంబాబు డొక్కా మాణిక్య వరప్రసాద్ తదితరులు ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉన్నవారే. కలిసి పనిచేసిన వారే. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీలో రఘువీరారెడ్డికి అందరూ గ్రాండ్ వెల్కమ్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రఘువీరారెడ్డిని త్వరలోనే జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరే అవకాశం ఉంది.

Related Posts