YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

యాదగిరిగుట్ట లో కాంగ్రెస్ నేతల ఆరెస్టు

యాదగిరిగుట్ట లో కాంగ్రెస్ నేతల ఆరెస్టు

యాదగిరిగుట్ట లో కాంగ్రెస్ నేతల ఆరెస్టు
యాదాద్రి భువనగిరి మార్చ్ 10 
యాదగిరిగుట్ట మండలం నుండి జైల్ బరో కార్యక్రమానికి వెళుతున్న కాంగ్రెస్ నేతలను యాదగిరిగుట్ట పోలీసులు. అదుపులోకి తీసుకున్నారు. టీపీసీసీ  వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని అరెస్టు  చేయడం తెరాస ప్రభుత్వం నియంత పాలనకు నిదర్శనం అన్నారు యాదగిరిగుట్ట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భరత్.  మంత్రి కేటీఆర్  పామ్ హౌస్ ను డోన్ కెమెరాతో వీడియో తీపించాడనే నెపంతో రేవంత్ రెడ్డిని అరెస్టు చూపించిన వైనం తెరాస ప్రభుత్వానిది అని తెరాస నాయకులపై మండిపడకడారు.  సముద్రం అలలు ఎగసిపడడం కొత్తకాదు అలాగే కాంగ్రెస్ నాయకులపై ప్రభుత్వాలు పెట్టె కేసులు కూడా కొత్తకాదు.  సముద్రం విస్తీర్ణం పెద్దది అలాగే కాంగ్రెస్ నేతల గుండె కూడా పెద్దదే. ఈ లాంటి వాటికి బయపడం అని అన్నారు, అలాగే కేసీఆర్ కుట్రలకు భయపడేది లేదు ప్రశ్నించే గొంతును కట్టడి చేసేందుకు తెరాస వారు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు అన్ని విఫలం కావడంతో లేనిపోని కేసులు బడ్డాయిస్తున్నారు తెరస ప్రభుత్వం. మొన్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కౌరవుల వలే వారు ప్రశ్నించే గొంతును ఆపిన వైనం తెరసాది అసెంబ్లీ నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే లను బహిష్కరించారు. ఇదేనా ప్రజాపాలన ఇది ప్రజల బాగోగులు కోరే ప్రభుత్వం కాదు తెరాస పార్టీ నాయకులను కాపాడుకునే ప్రభుత్వం. వీరికి ప్రశ్నించే గొంతు ఉంటే భయం అందుకే కాంగ్రెస్ నాయకుల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు.

Related Posts