YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రతిరోజు క్షేత్రస్థాయిలో ఎన్ని కేసుల నమోదులు తెలియచెయ్యాలి..

ప్రతిరోజు క్షేత్రస్థాయిలో ఎన్ని కేసుల నమోదులు  తెలియచెయ్యాలి..

ప్రతిరోజు క్షేత్రస్థాయిలో ఎన్ని కేసుల నమోదులు  తెలియచెయ్యాలి..
ర్యాలీ లు, బైక్ ర్యాలీ లపై ప్రత్యేక దృష్టి సారించాలి.
అభ్యర్థులు చేసే ఖర్చుల పరిధి గతంలో కంటే రెండింతలు పెరిగాయి
.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్
విజయవాడ మార్చ్ 10
ఎన్నికల వ్యయ పరిశీలకులు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించడానికి చట్టబద్ధమైన విధిని కలిగి ఉంటారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం లో 13 జిల్లాల వ్యయ పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిశీలకులు తమ విధిని నిర్వర్తించడంలో తటస్థంగా మరియు నిష్పాక్షికంగా ఉండాలన్నారు. వెంటనే జిల్లాలలో విధుల్లో భాద్యతలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రతినిధిగా జిల్లాలో విధుల నిర్వహించాలని , రాష్ట్ర ఎన్ని కమిషన్ కు అన్ని సమయాల్లో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ఫిర్యాదులను పరిష్కరించడానికి పరిశీలకులు చురుకుగా వ్యవహరించాల్సి ఉందన్నారు. పరిశీలకులు ఎంసిసి, ఎన్నికల నిబంధనలను కఠినంగా అమలు చేసేలా చూడాల్సి ఉందన్నారు. అభ్యర్థులు ద్వారా ఎన్నికల చేసే ఖర్చులపై పర్యవేక్షణ, దృష్టి కేంద్రీకరించాలని తెలిపారు. ఎన్నికలలో అభ్యర్థులు చేసే ఖర్చులతో పాటు, సున్నితమైన ప్రదేశాలను గుర్తించి వాటిపై నిశితంగా దృష్టి సారించాల్సి ఉందన్నారు.ఎన్నికల్లో డబ్బు ప్రధాన పాత్రను అరికట్టడానికి ప్రచార వ్యవధిలో ఎన్నికల వ్యయ ఖాతాలను తరచూగా తనిఖీ చేయడానికి, పరిశీలించడానికి, యంత్రాంగాన్ని సమర్ధవంతంగా చేసేందుకు, జిల్లా కలెక్టర్ లతో సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందన్నారు. వివాహం, కుటుంబ వేడుకలు, వైద్య చికిత్స, ఫీజు చెల్లింపు మొదలైన ఏవైనా వ్యక్తి గత కారణాల వల్ల నిర్దేశించిన పరిమితి రూ .50,000 / - కంటే ఎక్కువ నగదు తీసుకువెళ్ళినందుకు సాధారణ ప్రజలను వేధిస్తున్నారనే విమర్శలకు అవకాశం ఇవ్వకూడదని రమేష్ కుమార్ తెలియచేశారు. ఎన్నికలలో అభ్యర్థులు చేసే ఖర్చులను గతంలో ఉన్న వ్యయ పరిధి కంటే రెండింతలు పెంచడం జరిగిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలియచేశారు. వ్యయ పరిశీలకులు వీలైనన్ని ఎక్కువ శిక్షణా కేంద్రాలకు హాజరు కావాలని, క్షేత్రస్థాయిలో విధుల్లో పాల్గొనే సిబ్బందికి, అధికారులకు తగిన సూచనలు చెయ్యాల్సి ఉందన్నారు. ఓటరు సౌలభ్యానికి ఎటువంటి అవాంతరాలు లేకుండా, తరచుగా తనిఖీ చెయ్యడానికి పోలింగ్ కేంద్రాలను సందర్శించాలి అని పేర్కొన్నారు. కనీస ప్రాథమిక సదుపాయాలు, సీనియర్ సిటిజన్లకు సదుపాయం, వైకల్యంతో బాధపడుతున్నవారు , మహిళలు స్వేచ్ఛ గా ఓటు హక్కు వినియోగించే దిశలో దృష్టి సారించాల్సి ఉందన్నారు. అందరిని కలుపుకొని ఎన్నికల మార్గదర్శకాలు కమిషన్ యొక్క నిబద్ధతను నిర్ధారించడానికి విధులను నిర్వర్తించాల్సి ఉందన్నారు. ఉద్దేశపూర్వక ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల పరిశీలకులు సహించరు అన్న సందేశం క్షేత్రస్థాయిలోకి వెళ్లాల్సిందే నని ఆయన తెలియచేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ కార్యదర్శి ఎస్.రామసుందర రెడ్డి, 13 జిల్లాల ఎన్నికల వ్యయ పరిశీలకులు పాల్గొన్నారు.

Related Posts