YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎన్నికలకు సై అంటే ఐ

ఎన్నికలకు సై అంటే ఐ

ఎన్నికలకు సై అంటే ఐ
వ్యూహాలకు పదును పెడుతున్న పార్టీలు
విశాఖపట్నం మార్చ్ 10
13 ఏళ్ల తరువాత విశాఖ గ్రేటర్ కార్పోరేషన్ కి ఎన్నికలు జరుగుతున్నాయి.జనరల్ ఎలక్షన్స్ లో వైసీపీ దూకుడు ప్రదర్శించినా .. విశాఖలో మాత్రం సైకిల్ 
చక్రం తిరిగింది. దీంతో ఈ కార్పోరేషన్ ను కైవసం చేసుకోవడానికి టీడీపీ, వైకాపాలు సై అంటే సై అంటున్నాయి.మేయర్ పీఠంపై కన్నేసిన ఇరు పార్టీలు  బలమైన అభ్యర్ధులను రంగంలోకి దింపడంతో పాటు గెలుపు కోసం ఫ్యూహాలకు పదును పెడుతున్నారు. ఏపీలోని విశాఖపై అన్నీ రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి.ఇక్కడ పాగా వేస్తే భవిష్యత్ బంగారు మయం అవుతుందని భావిస్తున్న ప్రధాన రాజకీయ పక్షాలు ఇప్పటికే అభ్యర్ధులను ఖరారు చెయ్యడంలో నిమగ్నమయ్యారు.విశాఖ త్వరలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటెల్ అవుతుందని ముందు నుంచి చెప్తున్న వైసీపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేలా పావులు  కదుపుతోంది.మరోవైపు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఇక అన్నీ రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం సర్వం సిద్దం చేసుకుంటున్నాయి.గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికలకి 10,600 మందిని పోలింగ్ సిబ్బందిని నియమించామన్నారు సీపీ ఆర్కేమీనా. ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ కాకుండా  కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టామన్నారు.పోలీస్, రెవెన్యుతో జాయింట్ తనిఖీ  బృందాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. నూతన చట్టం ప్రకారం డబ్బు,మద్యం పంపిణీ చేస్తే ఎన్నికైనా తర్వాతైనా అనర్హత వేటు పడుతుందని స్పష్టం చేశారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్‌ షీట్‌ ఉన్నవారిని బైండోవర్‌ చేయబోతున్నామని పేర్కొన్నారు.

Related Posts