YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

కరోనా ఎఫెక్టు….కర్నాటక స్కూళ్లు మూసివేత

కరోనా ఎఫెక్టు….కర్నాటక స్కూళ్లు మూసివేత

కరోనా ఎఫెక్టు….కర్నాటక స్కూళ్లు మూసివేత
బెంగళూరు మార్చ్ 10
 ప్రపంచంలో విళయతాండవం చేస్తున్న కరోనా ఎఫెక్ట్ ఇప్పుడు స్కూల్ పై పడింది.బెంగళూరు ప్రజలను కలవరం పుట్టిస్తున్న వైరస్ దెబ్బతో ప్రజలు 
హడలిపోతున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో బాగంగా ప్రాథమిక పాఠశాలలకు సెలువు ఇస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 10 నుంచి ప్రభుత్వం ఆదేశించే వరకూ పాఠశాలు మూసివేయాలని ఆదేశాల్లో తెలియచేశారు.కర్ణాటక విద్యాశాఖ మంత్రి సురేష్ , ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సమక్షంలో జరిగిన సమావేశంలో అధికారులు తీసుకున్న నిర్ణయం మేరకూ వెంటనే ఆదేశాలను అమలు చెయ్యాలని సూచించారు.కర్ణాటకలోని ప్రాథమిక పాఠశాలలకు తాము సెలవులు ప్రకటించామని కర్ణాటక విద్యాశాఖా మంత్రి సురేష్ కుమార్ అన్నారు. విద్యాశాఖా ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన విద్యాశాఖ, ఆరోగ్య శాఖ, బీబీఎంపీ, బెంగళూరు నగర, బెంగళూరు గ్రామీణ, జిల్లాల పరిధిలోని అన్ని ప్రాథమిక పాఠశాలలను వెంటనే మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని విద్యాశాఖా మంత్రి సురేష్ కుమార్ అన్నారు. చిన్నారులకు కరోనా వైరస్ తో పాటు, అంటు వ్యాధులు వ్యాపించకుండా గట్టిచర్యలు తీసుకున్నామని, అందులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని విద్యాశాఖా మంత్రి సురేష్ కుమార్ వివరించారు.బెంగళూరు ప్రజలు బయటకు వెళ్లి సంచరించడానికి కొంచెం భయపడుతున్నారు. కరోనా వైరస్ వ్యాధి వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి  భయం అవసరం లేదని ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. అయితే రద్దీగా ఉన్న ప్రాంతాల్లో సంచరించాలన్నా, పిల్లలను బయటకు పంపించాలాన్నా,  ముఖ్యంగా సిటీ బస్సులో ప్రయాణించాలన్నా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన 890 మంది కరోనా వైరస్ అనుమానితులను గుర్తించి వారిని పరిశీలనలో ఉంచామని, వీరిలో ఆరుగురిని ఐసోలేషన్ వార్డుకు తరలించినట్లు మంత్రి చెప్పారు. కేరళలో  ఐదు కరోనా వైరస్ కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Related Posts