YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

నిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్

నిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్

నిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్
చేర్యాల మార్చ్ 10
చేర్యాల మున్సిపల్ అభివృద్ధికి ఎంపీ  నిధుల నుండి30 లక్షల  కేటాయిస్తున్నాను.  ప్రభ్యత్వం తరపున ఒక ప్రభుత్వ ఉద్యోగ నియామకం చేపట్టలేదు. నిరుద్యోగులతో త్వరలో అసెంబ్లీ ముట్టడి చేస్తామని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. మంగళవారం నాడు అయన చేర్యాల పట్టణం  మున్సిపల్ కార్యాలయంలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి అనుకోకుండా హజరయ్యారు. ఎంపీ మాట్లాడుతూ ఎన్నికలో హామీ ఇచ్చి ఒక హామీ కూడా నెరవేర్చ లేదు. చేర్యాల పాత నియోజకవర్గ లో కొన్ని గ్రామాల్లో చెరువులను నింపలేదు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ప్రకటించి  నియమకాలు చేపట్టాలి. అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ ముఖ్యంగా నిరుద్యోగులకు నిరాశ కలిగించింది. లక్ష అరవై వెయ్యిల ఖాళీ ఉద్యోగాలు ఉన్నాయి.  ఏడూ ఏళ్లుగా ఒక డిఎస్సి నోటిఫికేషన్ వేయలేదు. 5 లక్షల మంది బీఈడీ, డీఎడి చదువుకొని నోటిఫికేషన్ కోసం చూస్తున్నారని అన్ఆరు. నాలుగు వేల  స్కూళ్ళు మూత పడ్డాయి. కాళేశ్వరం నుండి నీరు అందిస్తామని చెప్పి అందివ్వక పోవడం బాధాకరమని అన్నారు. ఆర్థిక మాంద్యం తో ఖర్చు లో ఎక్కువ చూపి అప్పులో తక్కువ చూపడం బాధాకరం. నిరుద్యోగ భృతి 3116 అన్నాడు నిస్సిగ్గుగా నిరుద్యోగులను మోసం చేశాడని సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.

Related Posts