పోలీస్‌స్టేషన్ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం
మందమర్రి మార్చ్ 10
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ ఎదుట సోమవారం సాయంత్రం ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సీఐ ముత్తి లింగయ్య తెలిపారు. స్థానిక సున్నంబట్టివాడకు చెందిన మల్యాల సాగర్ అదే ప్రాంతానికి చెందిన ఓ బాలికతో కొద్ది రోజులుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం సదరు బాలిక కుటుంబసభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సాగర్‌ను స్టేషన్‌కు రావాలని కోరారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన సాగర్ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఘటన చూసిన వెంటనే పోలీసు సిబ్బంది హుటాహుటీన బాధితుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సాగర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు అతడిని వరంగల్‌కు రిఫర్ చేశారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు సాగర్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.