YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

.కలకత్తాలో విజయవంతమైన హకర్స్ ఫెడరేషన్ ఉత్సవాలు 

.కలకత్తాలో విజయవంతమైన హకర్స్ ఫెడరేషన్ ఉత్సవాలు 

.కలకత్తాలో విజయవంతమైన హకర్స్ ఫెడరేషన్ ఉత్సవాలు 
-పాల్గోన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అశోక్ గంగులీ 
మార్చి 10   
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కలకత్తాలో జాతీయ చిరు వ్యాపారస్తుల సమైక్య ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయిని ,జాతీయ చిరువ్యాపారస్తుల సమక్య కోరుట్ల అధ్యక్షుడు షాషేద్ మహ్మద్ షేఖ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  భారతదేశంలో చిరు వ్యాపారస్తుల సమైక్య ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆరు రోజులు పాటు ఉత్సవాలు ఘనంగా ముగిశాయిని , మొదటిరోజు కలకత్తాలో పెద్ద ఎత్తున ర్యాలీ, రెండవ రోజు కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ ఫీర్  హద్ హకీమ్ తో సమావేశం, తర్వాత రోజుల్లో దేశంలోని ప్రముఖ హకర్స్ అసోసియేషన్ నాయకులందరికి సన్మాన కార్యక్రమం జరిగిందని , బంగ్లాదేశ్ దేశంలో ఈ ఏడాది నవంబర్ లో జరిగిన జాతీయ సదస్సు పై చర్చ, ఉచిత రక్త, వైద్య శిబిరం, దేశంలో హకర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై పరిష్కారం, స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశమై చర్చించారన్నారు. మున్సిపల్ కేంద్రంలో రోడ్డుపై అమ్మకాలు చేసే చీరు వ్యాపారస్తుల సరకులు ఎండకు ఎండిపోయి తీవ్ర నష్టం జరుగుతుందని, ఇందుకు అధికారులు కోల్డ్ స్టోర్ నిర్మించాలని, కోరుట్ల జాతీయ చిరు వ్యాపారస్తుల సమైక్య అధ్యక్షుడు లేని పక్షాన షెడ్లు నిర్మించాలని, సరుకులు అమ్మకాల విషయంలో ఒక హకర్ టెండర్ ద్వారా సరుకులు కొనుగోలు చేసుకోవాలని సూచించినట్లు షాషేద్ మహ్మద్ షేఖ్ తెలిపారు.  దేశానికి సంబంధించిన వివిధ రంగాలకు చెందిన కళాకారులతో ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారని , ఈ ఉత్సవాల్లో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అశోక్ గంగూలీ, కలకత్తా మున్సిపల్ మేయర్ ఫీర్ హద్ హకీమ్ ,ఆల్ ఇండియా జనరల్ సెక్రెటరీ శ్రీ శక్తిమాన్ గోష్ , మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు ఆనితా దాస్,ఆల్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇనాయత్ అలీ బోఖరీ ,దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, హైదరాబాద్ ,కరీంనగర్, నిజామాబాద్ ,జగిత్యాల జిల్లాకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారని వారు తెలిపారు.

Related Posts