YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

దీపం గురించి తెలుకుందాము*

దీపం గురించి తెలుకుందాము*

*దీపం గురించి తెలుకుందాము*
*హిందూ ధర్మ శాస్త్రంలో హైందవ జీవన విధానంలో పూజలో గృహంలో దీపాలకు చాలా ప్రత్యేకమైన  స్థానం ఉంది.*
*దీపాలకు కూడా దీపాల లోకం ఉంటుంది అని చిన్నతనంలో అమ్మమ్మ వాళ్ళు చెప్పగా విన్నాము. దీపాలు కొండ ఎక్కగానే దీపాల లోకానికి చేరుకొని, ఇంటి ఇల్లాలు గురించి ఆమె ఔదార్యము, భక్తి, వినయము, సంస్కారం గురించి ఆ లోకంలో చర్చించు కుంటాయి అని, మరలా దీపారాధన సమయానికి ఇంటి ఇల్లాలు ఆహ్వానం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి అని చెప్పేవాళ్ళు.*
*ఏ ఇంటి దీపాలు సమయానికి గృహానికి ఆహ్వానించ బడతాయో ఆ ఇంటి దీపాలను ఆ లోకంలో అంత గౌరవించ బడతాయి. దీపారాధన జరగకుండా ఎపుడో కానీ ఆహ్వానించని దీపాలు ఆ లోకంలో తోటి దీపాల ముందు అలాంటి ఇంటికి దీపాలు అయినందుకు అవమానంగా బాధ పడతాయి.*
*దీపాలు కొద్దిగా నూనెతో వెలిగించి, నూనె ఐపోగానే కొండ ఎక్కాయి అనుకుంటారు. కానీ దీపానికి ఒత్తి కొనలో గూడుకడుతుంది కదా ఆ గూడు నలపకూడదు ఎందుకంటే నూనె అయిపోయిన దీపం జ్యోతి అందులోనే ఉంది. ఆ ఇంటి యజమాని క్షేమంగా రావాలి అని ఆ ఇంటి పిల్లలు జాగర్తగా ఇల్లు చేరాలి అని దీపం జ్యోతి భగవంతుడిని ప్రార్ధిస్తూ ఉంటుంది. ఇంటి యజమాని వచ్చే వరకు ఆ ఇంటి ఇల్లాలుకు తోడుగా ఉండి ఆ ఇంటి క్షేమం కోసం ప్రార్ధిస్తూ అందులోనే ఉంటుంది. అందుకే దీపం కొండ ఎక్కగానే ఒత్తికి నల్లగా కట్టిన గూడుని నలపరాదు.*
*గుడిలో పెట్టే దీపాలు, మనకు పుణ్యలోకాలకు దారి చూపిస్తాయి అంటారు. మన పూర్వీకులకు కూడా పుణ్యలోకాలకు వెలుగు చూపిస్తుంది అని హిందువుల నమ్మకం.*
*దీపం ఎలా, ఎప్పుడు, ఏ నూనెతో తెలుసు కుందాము. మనం దేవుడికి పూజ చేయాలంటే మొట్టమొదట చేసే పని దీపారాధన. ఆ తర్వాతనే మిగతా పూజా కార్యక్రమాన్ని మొదలుపెడతాము. దీపానికి హిందు సాంప్రదాయంలో విశిష్ట స్థానం ఉంది. ఒక పని విజయవంతంగా సాగడానికి కారణం దీపం. అలాగే దీపం వెలుగు మెదడుకు ఏకాగ్రతను ప్రసాదిస్తుంది.*
*దీపంలోని ఒక్కో భాగం ఒక్కో దేవతా స్వరూపం. దీపం అడుగు భాగంలో బ్రహ్మ, మధ్య భాగంలో విష్ణువు, ప్రమిదలో శివుడు, వెలుగులో సరస్వతీ దేవి, నిప్పు కణికలలో లక్ష్మీ దేవి నివసిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే పూజలో భాగంగా దీపానికి నమస్కరిస్తారు.*
*ఈ క్రింది శ్లోకం పలుకుతూ  జ్యోతి ప్రజ్వలన చేయడం చాలా మంచిది.*
*శ్లో” దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం|*
*దీపో హరతుమే పాపం, దీపలక్ష్మీ నమోస్తుతే||*
*భావం: దీపం పరబ్రహ్మ స్వరూపం. బ్రహ్మ సకల జ్ఞానానికి ప్రతిరూపం. దీపం సకల కార్యాలను విజయవంతంగా పూర్తి చేస్తుంది. దీపం పాపాలను తొలగిస్తుంది.*
*ఆవునెయ్యి, నువ్వులనూనెతో దీపారాధన చేయడం శ్రేయస్కరం. ఆవునెయ్యిలో సూర్యశక్తి ఉంటుంది.*
*దీనివల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయి. ఆవునెయ్యిలో నువ్వులనూనె కలిపి దీపారాధన చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి.*
*వేపనూనెలో రెండు చుక్కల ఆవునెయ్యి కలిపి పరమశివునికి దీపారాధన చేస్తే చేపట్టిన పనుల్లో విజయం వరిస్తుంది. కొబ్బరినూనెతో అర్ధనారీశ్వరుడికి దీపారాధన చేస్తే దాంపత్యం అన్యోన్యంగా ఉంటుంది. నువ్వులనూనె సకల దేవతలకు ప్రీతిపాత్రమైనది. ఈ నూనెతో దీపారాధన చేస్తే దేవతలు సంతృప్తి చెంది దుష్ఫలితాలు దూరం చేసి సకల శుభాలు ప్రసాదిస్తారు. దీపం పరబ్రహ్మ స్వరూపం.*
*దీపారాధన జరిగే ప్రదేశంలో మహాలక్ష్మి స్థిరనివాసం ఉంటుంది. దీపం వెలిగించే కుంది కింది భాగంలో బ్రహ్మ, మధ్యభాగంలో విష్ణుమూర్తి, ప్రమిదలో శివుడు, వత్తి వెలుగులో సరస్వతి, విస్ఫలింగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటారు. దీపారాధనలో వెండికుందులు విశిష్టమైనవి. పంచలోహ కుందులు, మట్టికుందులది తర్వాతి స్థానం. ఎట్టి పరిస్థితుల్లో స్టీలు కుందిలో దీపారాధన చేయరాదు.*
*ఒంటరి కుందిలో దీపారాధన చేయరాదు. కుంది కింద మరో కుంది తప్పనిసరిగా ఉండాలి.*
*దీపం ఏ సమయంలో వెలిగిస్తే మంచిది ?*
*కొంత మంది దీపం రెండు పూటలూ పెడతారు. మరి కొంతమంది సాయంత్రం పెడతారు. సూర్యోదయ సమయంలో అంటే ఉదయం నాలుగున్నర గంటల నుంచి ఆరుగంటల లోపు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఆ సమయంలో దీపం పెడితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయని మహర్షులు చెప్పారు. కొంత మంది సమయం దొరకక పదకొండు, పన్నెండు గంటలకు దీపారాధన చేస్తారు. శాస్త్ర రీత్యా ఆ సమయంలో నిత్య దీపారాధన చేయడం మంచిది కాదు. మరీ ఆరు గంటలకు కుదరక పోతే ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా అంటే కనీసం ఏడూ, ఎనిమిది గంటలకన్నా చేయాలి.*
*సాయంత్రం అయితే ఆరు గంటల నుంచి ఆరున్నర లోపు దీపం వెలిగిస్తే మనం అనుకున్న ఫలితాలు వస్తాయి.*
*దీపం వెలిగించడమంటే దేవుడిని ఆరాధించడమే. దీపారాధనను శాస్త్రోక్తంగా చేయాలి. అది దీపం ఏర్పాటు చేసుకోవడం నుంచే ప్రారంభమవుతుంది. ఉదయం 4.30 నిమిషాల నుంచి 6 గంటల మధ్య వెలిగిస్తే ఆ ఇంటిలో అధిక సంపద, దేవుళ్ళ ఆశీర్వాదం, కుటుంబంలో శ్రేయస్సు వృద్ధి చెందుతాయి.*
*48 రోజుల పాటు ప్రతిరోజు ఇలా వెలిగిస్తే మనోసిద్ధి కలుగుతుంది. అంటే మనసులో ఉన్న కోరికలు నెరవేరతాయి.*
*సాయంత్రం 6 నుంచి 6.30 మధ్యలో దేవునికి దీపాలను వెలిగిస్తే ఉద్యోగం కోసం
ఎదురుచూసేవారు, ఉత్తమ జీవితం కావాలనుకునే వారు కుటుంబ సంతానాన్ని పొందుతారు. ఆ ఇంటిలోని వారందరికీ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది.*
*"అగ్నిమీళే పురోహితం యఙ్ఞస్య దేవమృత్విజమ్హో తారం రత్నధాతమమ్"*
*ఇది ఋగ్వేదంలోని తొలి ఋక్కు. ఈ ఋక్కుతోనే వేదం ప్రారంభమవుతుంది. అంటే...తొలిసారిగా కీర్తించబడిన తొలి దేవుడు ‘అగ్ని’. అంటే ‘జ్యోతిస్వరూపం’. ఈ జ్యోతిస్వరూపమే పురహితాన్ని కోరే తొలి పురోహితుడు. ఋత్విక్కుడూను. మన జీవితంలోని మంచి, చెడులలో మనకు తోడుగా ఉంటూ, మార్గదర్శకత్వం వహించేది ఈ జ్యోతి ఒక్కటే. కనుక ఆ ‘జ్యోతిని’ ఉపాసించడం., ఆరాధించచడం మన ధర్మం.*
*దీపం ఉదయం 5-5.30, వరకు దీపానికి వినాయకుడు అధిపతి వినాయకుడి అనుగ్రహం కోసం ఆ సమయంలో దీపారాధన చేయాలి.*
*5.30-6 am వరకు దీపానికి అధిపతి లక్ష్మీ దేవి ఆ సమయంలో ఏ ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటుందో ఆ దీపంలో లక్ష్మీ దేవి కూర్చొని వేంకటేశ్వరస్వామిని ప్రార్ధన చేస్తుంటుంది. అప్పుడు స్వామి దృష్టి ఆ ఇంటి పైన పడుతుంది అని పెద్దలు చెప్తారు.*
*సూర్యోదయానికి వెలిగే దీపాలు విష్ణువుకు చెందుతాయి. సూర్యాస్తమయం (ప్రదోషం) సమయం లో దీపాలు శివయ్య కు చెందుతాయి అని ప్రతీతి.*
శ్రీ మాత్రే నమః

వరకాల మురళి మోహన్ సౌజన్యంతో 

Related Posts