బోలా శంకరునీ కన్నీటితో అదృష్టంగా మారిన మానవుడు!!!
అందరిని ఆదుకునే శివుడు కన్నీరు పెట్టాడా? దీనివల్ల మానవునికి కలిగిన అదృష్టం ఏంటి? ఇది నిజమేనా? నిజమే అని చెప్తున్నాయి శివ పురాణం, రుద్రాక్ష ఉపనిషత్ ,రుద్ర కారుణ్య మహత్యం, దేవి భాగవతం, లింగ పురాణం ,స్కాందపురాణం ఇలా అన్ని పురాణాలలో ఉన్నది. ఈ పురాణాల్లో దాగిన విషయం ఏంటంటే ముందుగా శివుని కన్నీటికి కారణం తెలుసుకుందాం. శివుడు అనగా రుద్రుడు రాక్షసులతో పోరాడి మూడు పురములను భస్మం చేశాడు .ఆ తదుపరి మరణించిన వారిని చూసి విచారించాడు. ఆ సమయంలో ఆయన కన్నీటి నుండి జాలువారిన కన్నీరు భూమి పైన పడింది, జాలువారిన కన్నీటి నుండి ఒక చెట్టు ఉద్భవించింది అదే మానవునికి అన్ని దోషాలను పోగొట్టి మానవునికి అదృష్టాన్ని అందిస్తున్న రుద్రాక్ష చెట్టు శ్రీశైలం కి తూర్పు ద్వారమైన త్రిపురాంతకం ఈ క్షేత్రంలో పరమశివుడు త్రిపురాసురులను సంహరించడంతో త్రిపురాంతక క్షేత్రమే రుద్రాక్షల జన్మస్థలమని కూడా చెబుతారు.ఇక ఈ విషయాన్ని పరమశివుడు స్వయంగా ఇలా చెప్పాడు ఒకప్పుడు త్రిపురాసుర పదార్థమైన నేను నీ మెలిక నేత్ర కూడా నై ఉండగా నా కన్నుల నుండి జల బంధువులు భూమిపై పడినవి ఇవి సర్వజనుల క్షేమ అర్థము రుద్రాక్ష వృక్షములు గా జన్మించిన వి అని తెలిపారు. సాక్షాత్ పరమ శివుని కన్నీటి నుండి పుట్టిన రుద్రాక్షలు మానవుని సమస్త దోషాలు తొలగించి అనునిత్యం కాపాడుతూ ఉన్నాయి. శివుని కన్నీటి నుండి మానవునికి దొరికిన గొప్ప వరం రుద్రాక్ష...
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో