YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రెండు మంత్రి పదవుల కోసం ఇరవై మంది పోటీ

రెండు మంత్రి పదవుల కోసం ఇరవై మంది పోటీ

రెండు మంత్రి పదవుల కోసం ఇరవై మంది పోటీ
విజయవాడ, మార్చి 11
గన్ కేబినెట్ లో ఇద్దరు మంత్రులు తొలిగిపోయినట్లే. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలను రాజ్యసభ అభ్యర్థులుగా వైసీపీ చీఫ్ జగన్ ఖరారు చేయడంతో ఆ ఇద్దరి ప్లేస్ లో జగన్ ఎవరిని తీసుకుంటారనేది చర్చనీయాంశమవుతుంది. రాజ్యసభ పదవులకు ఎంపిక కాగానే వీరిద్దరూ మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. ముఖ్యమైన రెవెన్యూ శాఖను పిల్లి సుభాష్ చంద్రబోస్ నిర్వహిస్తున్నారు. అలాగే మోపిదేవి వెంకటరమణ పశుసంవర్థకశాఖ, మత్స్యశాఖ మంత్రిగా ఉన్నారు.ఈ ఇద్దరి రాజీనామాలు చేసిన తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ ఇద్దరి స్థానంలో జగన్ అదే సామాజిక వర్గానికి చెందిన నేతలను తీసుకుంటారా? లేక ఇతర సామాజిక వర్గాలకు చోటు కల్పిస్తారా? అన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది.నిజానికి తొలి మంత్రి వర్గ విస్తరణలో జగన్ అనేకమంది సీనియర్ నేతలను పక్కన పెట్టారు. ప్రాంతాలు, సామాజికవర్గాల సమీకరణాల లెక్కలతో కొందరికి తొలి విస్తరణలో చోటు దక్కలేదు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి కూడా జగన్ ఇవ్వలేకపోయారు. దీంతో ఈసారి కొందరు సీనియర్ నేతలను మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. సామాజిక వర్గాలను కూడా పక్కన పెట్టి విధేయతకే పెద్దపీట వేస్తారంటున్నారు.రెండున్నరేళ్ల తర్వాత మాత్రమే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని జగన్ తొలుత చెప్పినప్పటికీ అనుకోని పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణ చేపడతారంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చతికల పడిన మంత్రులను తొలిగించే అవకాశమూ ఉందంటున్నారు. ఇప్పటికే జగన్ ఈ హెచ్చరికలను మంత్రులకు జారీ చేశారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం పార్టీలో ఉంది. మరి జగన్ పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేస్తారా? లేక ఆ రెండు పదవుల వరకూ భర్తీ చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.

Related Posts