YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 విశాఖలో గురుశిష్యుల మధ్య గొడవలు ..

 విశాఖలో గురుశిష్యుల మధ్య గొడవలు ..

 విశాఖలో గురుశిష్యుల మధ్య గొడవలు ..
విశాఖపట్టణం, మార్చి 11
మిలి అసెంబ్లీ సీటు దగ్గర మొదలైన గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావుల మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. టీడీపీలో ఉండగా టికెట్‌ విషయంలో మొదలైన వివాదం.. ఇప్పుడు వేర్వేరు పార్టీలో ఉన్నా సెగ రగులుతూనే ఉంది. భీమిలి నుంచి ఇప్పుడు విశాఖ ఉత్తర నియోజకవర్గం వరకు వచ్చింది. గత ఎన్నికలకు ముందు భీమిలి సీటు కోసం వారిద్దరూ పోటీపడ్డారు.టీడీపీ అధినేత చంద్రబాబు ఏ విషయం తేల్చకపోవడంతో వైసీపీలో చేరిపోయారు అవంతి. భీమిలి టికెట్‌ సంపాదించి గెలిచి, ఏకంగా మంత్రి కూడా అయిపోయారు. ఇటు గంటా శ్రీనివాసరావు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గంటాను ఎలా అయినా ఓడించేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు చేసింది. కానీ, గంటా ఆ నియోజకవర్గంలో కేకే రాజు మద్దతుదారులను టీడీపీలోకి లాగేసుకున్నారు. అయినా కేకే రాజు మాత్రం వీధివీధి తిరిగి గెలుపే లక్ష్యంగా పనిచేశారు. స్వల్ప మెజారీటితో గంటా గట్టెక్కారు.గంటా గెలుపును అవంతి ఏ మాత్రం జీర్ణంచుకోలేక పోయారు. తాను గెలిచినా టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో గంటా సైలెంట్ అయిపోయారు. నియోజకవర్గంలో కూడా గంటా అంతగా కనిపించకపోవడంతో కేకే రాజును రంగంలోకి దింపారు అవంతి. కేకే రాజు కూడా వార్డుల్లో పర్యటిస్తూ, అవంతిని ఆహ్వానిస్తున్నారు. ప్రతి సందులోనూ ఏదో ఒక శంకుస్థాపన పనులు చేస్తూ నియోజకవర్గంలో పట్టుకోసం అవంతి ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గానికి వచ్చిన ప్రతిసారి మీ ఎమ్మెల్యే ఎక్కడంటూ ప్రజలను ప్రశ్నిస్తున్నారు. ఓట్లు వేసి గెలిపించారు కదా.. అభివృద్ధి గురించి గంటాను నిలదీయరా అని అడుగుతున్నారు. ఇక్కడ కేకే రాజు మాత్రమే పని చేస్తున్నారు. ఆయన మాత్రమే మీ అభివృద్ధికి పాడుపడుతున్నారంటూ రాజును ఆకాశానికెత్తేస్తున్నారు. తద్వారా పార్టీని అక్కడ మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గంటా కూర్చున్న చోటనే నిప్పు రాజేయాలని అవంతి స్కెచ్ వేశారట.గంటా నియోజకవర్గంలో వైసీపీ సమన్వయకర్తగా కేకే రాజును అడ్డం పెట్టుకుని ఆటాడుకుంటున్నారు. ఉత్తరానికి ఎమ్మెల్యే గంటా అయినప్పటికీ,  కేకే రాజే ఎమ్మెల్యే అన్న భ్రమ కలిగించేలా వ్యూహరచన చేశారు. నియోజకవర్గం పరిధిలో  ప్రభుత్వ కార్యాలయాలను కేకే రాజుతో తనిఖీలు చేయించడం, ప్రభుత్వ పథకాలు ఏది ప్రారంభమైనా సరే నియోజకవర్గంలో కే కే రాజునే ముఖ్యఅతిథిగా వెళ్లేలా చేయడం లాంటి చర్యలతో టీడీపీ కార్యకర్తలు కుతకుతలాడిపోతున్నారట.పెన్షన్ల పంపిణీ, అమ్మ ఒడి, నవరత్నాలు, ఆటో కార్మికులకు భృతి ఇలా ఏదైనా సరే ఉత్తర నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న గంటాతో కాకుండా ఓడిన కేకే రాజు చేతుల మీదుగానే సాగుతున్నాయి. దీంతో సహజంగానే ప్రజలు కూడా అసలు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరన్న అయోమయంలో ఉన్నారంటున్నారు. సాధ్యమైనంత వరకూ గంటా నియోజకవర్గంలోనే పర్యటిస్తూ, గంటాను హేళన చేసేలా అవంతి వ్యవహారం సాగుతోందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. అధికారులు మాత్రం ఏదో ప్రొటోకాల్ మేరకు గంటాకు ఓ ఇన్విటేషన్ కార్డు పడేసి, మిగిలిన తంతు అంతా అవంతి స్క్రిప్ట్ ప్రకారం నడిపించేస్తున్నారని అంటున్నారు. అవంతి కూడా తనను గెలిపించిన భీమిలి కంటే కూడా ఉత్తర నియోజకవర్గంపైనే నిధుల వరద పారిస్తూ గంటాపై కసి తీర్చుకుంటున్నారన్న టాక్‌ నడుస్తోంది.ఈ మధ్య ఉత్తర నియోజకవర్గంలోని బీజేపీ వార్డు నాయకులను టీడీపీలో చేర్చుకున్నారు గంటా. దీనికి కౌంటర్‌గా కేకే రాజు టీడీపీ వార్డు నాయకులను వైసీపీలోకి ఆహ్వానించారు. మొత్తమ్మీద గురుశిష్యుల రాజకీయం ఉత్తర నియోజకవర్గంలో సంచలనంగా మా

Related Posts