YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రేవంత్ రెడ్డి ఇష్యూలో రెండు నాలుకలు

రేవంత్ రెడ్డి ఇష్యూలో రెండు నాలుకలు

 రేవంత్ రెడ్డి ఇష్యూలో రెండు నాలుకలు
హైద్రాబాద్, మార్చి 11
రేవంత్ రెడ్డి అరెస్ట్, తదనంతర పరిణామాల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు రెండుగా చీలిపోయారు. రేవంత్ రెడ్డికి మద్దతుగా ఇచ్చే విషయంలో టి కాంగ్రెస్ నేతల మధ్య ఏకాభిప్రాయం రావడం లేదా ? కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలను బట్టి ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆరే జీవో 111 నిబంధనలు ఉల్లంఘించి ఫామ్‌హౌస్‌ నిర్మిస్తున్నారంటూ ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శలతో వివాదం మొదలైంది. అనంతరం అనుమతి లేకుండా ప్రైవేటు నివాసాన్ని డ్రోన్‌ ద్వారా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వెంటనే రేవంత్ రెడ్డి అరెస్ట్ కావడం... జైలుకు వెళ్లడం జరిగిపోయాయి.రేవంత్‌ అరెస్టు అక్రమమంటూ కాంగ్రెస్‌లోకి ముఖ్యనేతలందరూ ఖండించారు. అయితే, ఇప్పుడు ఈ అంశంపై ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం నేతలు రేవంత్‌కు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతుండగా, రాజకీయం చేయడం తగదని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. సీనియర్‌ నేత దామోదర రాజనర్సింహ ఈ అంశంపై కాస్త భిన్నమైన స్వరం వినిపించారు. రేవంత్‌ లేవనెత్తిన అంశం కంటే ముఖ్యమైన సమస్యలు రాష్ట్రంలో చాలా ఉన్నాయని, భూ వివాదాలేవైనా ఉంటే కోర్టుల్లో తేల్చుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించడం సరికొత్త చర్చకు దారి తీస్తోంది.కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ జీవో అమల్లో ఉన్న పలు గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర రైతులు ఇబ్బందులు పడుతున్నారని... దీన్ని రద్దు చేయాలని గతంలో తమ ప్రభుత్వం సైతం కేంద్రంతో సంప్రదింపులు జరిపిందని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ అంశంలో షబ్బీర్‌ అలీ, మల్లు రవి, ఎమ్మెల్యే సీతక్క వంటి కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. జైలు నుంచి రేవంత్‌ విడుదల తర్వాత భారీ ర్యాలీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే టీపీసీసీ చీఫ్‌ రేసులో రేవంత్ రెడ్డి ముందు వరుసలో ఉండటం కూడా ఆయనకు కాంగ్రెస్‌లోకి ఓ వర్గం నుంచి మద్దతు రాకపోవడానికి కారణమవుతోందనే వాదన వినిపిస్తోంది. మొత్తానికి రేవంత్ రెడ్డి విషయంలో టి కాంగ్రెస్ మరోసారి రెండుగా చీలిపోయినట్టు కనిపిస్తోంది.

Related Posts