రాష్ట్రవ్యాప్తంగా నాటు సారా పై మెరుపు దాడులు
అమరావతి మార్చి 11
ఏపీ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్ కు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పోలీస్, ఎక్సైజ్ శాఖ సమన్వయంతో నాటు సారా తయారీ కేంద్రాలపై బుధవారం తెల్లవారుజామునుంచి దాడులు ప్రారంభమయ్యాయి. పదివేల మంది సిబ్బందితో తనిఖీలు కొనసాగాయి. వందలాది మంది పోలీస్ అధికారులతో కూడిన బృందాలతో , అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలు, ప్రొబేషనరీ ఐపీఎస్, సిఐలు,ఎస్సైలు, పది వేల మంది సిబ్బందితో రాష్ట్ర వ్యాప్తంగా మెరుపు దాడులు నిర్వహించాయి. నాటుసారా నిల్వలు ఉన్నాయనే సమాచారం మేరకు జిల్లాలను జల్లెడ పట్టారు. ఉదయం వరకే పెద్ద మొత్తంలో బెల్లం ఊట నిల్వలు, నాటుసారా నిల్వలను ధ్వంసం చేసినట్లు సమాచారం.ఎన్నికల్లో పూర్తిగా మద్యం, డబ్బు పంపిణీని కట్టడి చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్న మెరుపు దాడులు దాడులు