మహిళా టీచర్ ఆత్మహత్య
నందిగామ మార్చి 11
కృష్ణాజిల్లా నందిగామ కంచికచర్ల లో దారుణం జరిగింది. కంచికచర్ల జుజ్జూరు రోడ్డు పాములపాటి వారి వీధిలో వుంటున్న మహిళ టీచర్ అను మానాస్పద స్థితిలో మృతి చెందింది. కార్యంపూడి నాగమణి అనే మహిళ టీచర్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. బుధవారం ఉదయాన్నే వచ్చిన పని మనిషి నాగమణి మృతదేహం చూసి కేకలు వేయడంతో స్థానికులు ఘటనను గమనించారు. పోలీసులకు సమాచారం అందించారు. నాగమణి మృతదేహం పూర్తిగా కాలిన స్థితిలో పడివుంది. మృతురాలు వీరులపాడు మండలం జూలూరు గ్రామం హై స్కూల్ లో టీచర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. నాగమణిది అనుమానాస్పద మృతి క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.