YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

నత్వానీ స్థానంలో దళితుడికి అవకాశం ఇవ్వండి

నత్వానీ స్థానంలో దళితుడికి అవకాశం ఇవ్వండి

నత్వానీ స్థానంలో దళితుడికి అవకాశం ఇవ్వండి
విజయవాడ మార్చి 11
టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా నన్ను టీడీపీ అధిష్టానం ఎంపిక చేశాక వైసీపీ నేతలకు నాపై ఎక్కడ లేని ప్రేమ వచ్చేసింది. నాకు గతంలో టీడీపీ రాజ్యసభ సీటు ఇవ్వనందుకు కన్నీటి పర్యంతమయ్యానని సాక్షిలో చెత్తరాతలు రాస్తున్నారు. నత్వానీ స్థానంలో దళితుడికి వైసీపీ రాజ్యసభ సీటిస్తే నేను విత్ డ్రా చేసుకుంటానని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. నేను ప్రతిరోజూ చంద్రబాబు ఆలోచనలతో పాలుపంచుకుంటాను. జగన్ ఆలోచనలతో పాలు పంచుకున్నామని వైసీపీ దళిత నేతలు చెప్పగలరా? జగన్ ఎప్పుడైనా మీతో ఏ విషయం గురించైనా మాట్లాడారా? రాజ్యసభ సీట్లపై మీతో చర్చించారా? వైసీపీ అకృత్యాలపై ప్రజల్లో చర్చ జరగాలనే నేను రాజ్యసభ బరిలో నిలిచానని అన్నారు. దళితులకు రాజ్యసభ సీటు ఇమ్మని జగన్ ను అడిగే దమ్ముందా ఆదిమూలపు సురేష్ కు?  ఆకారపు సుదర్శన్ ను రాజ్యసభకు పంపిన ఘనత తెలుగుదేశానిది. నేను టీడీపీ వారియర్ ని. ఆత్మ ప్రబోధానుసారం వైసీపీ ఎమ్మెల్యేలు ఓటేయాలి. టీడీపీ నిర్ణయం నాకు శిరోధార్యమని అయన అన్నారు.  తన తండ్రి మరణం వెనుక రిలయన్స్ ఉందని దాడులు చేయించిన జగన్ నత్వానీకి రాజ్యసభ సీటు ఎలా ఇచ్చారు? నత్వానీ కి కాకుండా ఓ దళితుడికి రాజ్యసభ సీటు ఇవ్వొచ్చు కదా. దళితుడిని పార్లమెంటు అధ్యక్షుణ్ణి చేసిన ఘతన చంద్రబాబుది. ఓట్ల కోసమే జగన్ కు దళితులు కావాలి. సాక్షిలో నా ఫోటో వేయడం ద్వారా లబ్ధి పొందాలని జగన్ భావిస్తున్నారు. వైసీపీలో ఉన్న దళిత ఎమ్మెల్యేలవి బానిస బతుకులని అయన విమర్శించారు. 

Related Posts