తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఒక్కటి కూడా లేవు
ఉన్న ఒక వ్యక్తికి కూడా నయమైంది
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈ టెల రాజేందర్
హైదరాబాద్ మార్చ్ 11
ప్రస్తుతం తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఒక్కటి కూడా లేవు పాజిటివ్ ఉన్న ఒక వ్యక్తికి కూడా నయమైంది ప్రోటోకాల్ ప్రకారం 14 రోజులు అతని హాస్పిటల్ లో ఉంచి చికిత్స అందిస్తాము ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కరోనా వైరస్ ఉండటంతో వివిధ దేశాల్లో ఉన్న మన రాష్ట్రం వారు తిరిగి మన దగ్గరికి వస్తున్నారు కాబట్టి అన్ని ఏర్పాట్లలో 24 గంటలు స్క్రీనింగ్ చేయడానికి ఏర్పాటు చేశాము ప్రతి వ్యక్తి డేటా సేకరించి వారి వారి ఇళ్లలోనే ఉంచి సర్వైలెన్స్ చేస్తాము ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఏడు ఏరో బ్రిడ్జి లు ఉన్నాయి ప్రస్తుతం ఉన్న వైద్య సిబ్బంది సరిపోవడం లేదు కాబట్టి నాలుగు రెట్లు పెంచి 200 మందితో 24 గంటలు స్క్రీనింగ్ చేస్తాము ప్రస్తుతానికి 4 స్క్రీన్ అందుబాటులో ఉన్నాయి నాలుగింటిని ఏర్పాటు చేస్తున్నాం కేంద్ర మంత్రి హర్షవర్ధన్ గారితో మాట్లాడి మరిన్ని సదుపాయాల కోసం విన్నవించాము మన రాష్ట్రంలో పాజిటివ్ కేసులు ఒక్కటి కూడా లేకపోయినా పక్కనే ఉన్న కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు ఈరోజు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఎలర్ట్ ప్రకటించారు ఉస్మానియా యూనివర్సిటీ లో ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో మరో ల్యాబ్ పరీక్షల కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతించింది త్వరలోనే అక్కడ కూడా పరీక్షలు మొదలుపెడతాం గత పదిహేను రోజుల్లో విమానాశ్రయంలో 41,102 మందికి స్క్రీన్ చేసాము 277 మంది అనుమానితులను గాంధీ ఆస్పత్రికి తరలించి వైరస్ పరీక్షలు నిర్వహించారు వీరందరూ కూడా కరోనా వైరస్ లేదని నిర్ధారణ జరిగింది కేరళ రాష్ట్రంలో పర్యటించిన వైద్య బృందం రిపోర్టు ఇచ్చింది వారిదగ్గర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో వార్డులు ఏర్పాటు చేశారు ప్రస్తుతానికి మన రాష్ట్రంలో వ్యాప్తి చెందలేదు కాబట్టి ఆ స్థాయిలో అవార్డులు అవసరం లేదు కానీ జిల్లాస్థాయిలో రేషన్ కార్డులను సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి గ్రామపంచాయతీ వరకు కరోనా వైరస్పై సిబ్బందికి అవగాహన కలిగించడం అప్రమత్తతో ఉన్నాము.