YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

వైఎస్‌ వివేకా హత్య కేసు.. సీబీఐకి అప్పగింత ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక నిర్ణయం

వైఎస్‌ వివేకా హత్య కేసు.. సీబీఐకి అప్పగింత  ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక నిర్ణయం

వైఎస్‌ వివేకా హత్య కేసు.. సీబీఐకి అప్పగింత
      ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక నిర్ణయం
 అమరావతి, మార్చ్ 11 
వైఎస్సార్‌సీపీ నాయకులు వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. వీలైనంత త్వరగా కేసు విచారణ పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది కోర్టు. భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత పిటిషన్లను కోర్టు విచారించింది. మొత్తం నాలుగు పిటిషన్లను విచారించిన అనంతరం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. హత్య జరిగి ఏడాది అవుతున్నా దర్యాప్తులో పురోగతి లేదని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తులో సమయం కీలకం కాబట్టి సీబీఐకి అప్పగిస్తున్నట్లు కోర్టు తెలిపింది. సీఎం జగన్‌ పిటిషన్‌ ఉపసంహరణ ప్రభావం దర్యాప్తుపై ఉండకూడదని కోర్టు చెప్పింది. కడప జిల్లాలోని పులివెందుల నుంచి దర్యాప్తు ప్రారంభించాలని కోర్టు ఆదేశించింది. ఏడాది పాటు సిట్‌ విచారణ జరిపినా ఏమీ తేల్చలేకపోయిందని కోర్టు పేర్కొంది. కేసులో అంతర్‌రాష్ట్ర నిందితులు ఉండే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. 2019, మార్చి 15న వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన విషయం విదితమే.

Related Posts