YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా

టీడీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా

 టీడీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా
విశాఖపట్నం మార్చ్ 11
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి ఎదురు దెబ్బలు తప్పడం లేదు.తాజాగా విశాఖకు చెందిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో యలమంచిలి నుంచి పంచకర్ల పోటీ చేశారు.వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డితో పంచకర్ల రమేష్ బాబు వరుసుగా మంతనాలు జరిపినట్లు సమాచారం. పంచకర్ల రమేష్ బాబు 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.ప్రజారాజ్యం నుంచి పెందుర్తి నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమైన సంగతి తెలిసిందే. విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి..2014 ఎన్నికల సమయంలో గంటా శ్రీనివాస్ , అవంతి శ్రీనివాస్‌తో పాటుగా పంచకర్ల రమేష్ టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఎలమంచిలి నుంచి పోటీ చేసి గెలుపొందారు.రమేష్‌బాబు 2019 ఎన్నికల్లో ఎలమంచిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కన్నబాబురాజు చేతిలో ఓడారు. ఎన్నికల్లో రూరల్‌లో టీడీపీకి ఒక్క సీటు కూడా రాకపోవడంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.  తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు అనుచరులతో సమావేశమై పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సభ్యత్వానికి, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.త్వరలోనే కార్యకర్తలు అభిమానులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి రమేష్‌ బాబు తన భవిష్యత్తు కార్యచరణ ప్రకటించనున్నారు.విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ చేయడం టీడీపీ పెద్దలకు రుచించలేదని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు తెలిపారు. విశాఖ క్యాపిటల్‌గా వ్యతిరేకిస్తే నష్టపోతామని చెప్పినట్లు, టీడీపీ పెద్దలు నా మాటలను పక్కన పెట్టారని వాపోయారు. వికేంద్రీకరణకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయాలని తనకు చెప్పారని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీశారని తెలిపారు.రాజధానిగా విశాఖ వద్దనడం సరికాదని రమేష్‌ బాబు హితవు పలికారు. వెనకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా అభివృద్ధి చెందాలని కోరారు. అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు తాము ఒప్పుకున్నామని, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా విశాఖను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలు 23 సీట్లు ఇచ్చిన దానిపై చంద్రబాబు ఎప్పుడైనా చర్చించారా అని నిలదీశారు. పార్టీ ఫిరాయింపుదారులను మంత్రులను చేయడం ప్రజలు అంగీకరించలేదని తెలిపారు. టీడీపీలో కష్టపడిన వారికి గుర్తింపు లేదని రమేష్‌ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Related Posts