YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 సింహాచలం ట్రస్ట్ బోర్డు నియామాకాన్ని వ్యతిరేకించిన వీహెచ్పీ

 సింహాచలం ట్రస్ట్ బోర్డు నియామాకాన్ని వ్యతిరేకించిన వీహెచ్పీ

 సింహాచలం ట్రస్ట్ బోర్డు నియామాకాన్ని వ్యతిరేకించిన వీహెచ్పీ
విజయవాడ మార్చ్ 11 
రాష్ట్ర ప్రభుత్వం సింహాచల ట్రస్ట్ బోర్డు నియామకం, మాన్సస్ టస్ట్ బోర్డ్ నియామక నిబంధనలకు విరుద్ధంగా నియామకాన్ని వ్యతిరేకిస్తున్నాం. అర్ధరాత్రి హడావిడిగా జీవోలు విడుదల చేసి ట్రస్ట్ బోర్డ్ లను నియామకం చేశారు. విజయనగర రాజవంశానికి  చెందిన కుమారులను మాత్రమే నియమించి వలసి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జరిపిన నియామకం తీరు సరికాదని విశ్వహిందూ పరిషత్ కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్ అన్నారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. రాజ వంశస్థుడైన అశోక్ గజపతిరాజు ఆలయ చైర్మన్ గా కొనసాగుతున్నప్పటికీ ఆయనను తొలగించి, అదే కుటుంబానికి చెందిన సంచయితతో హడావిడి గా ప్రమాణ స్వీకారం చేయించారు.  రాజ కుటుంబంలో రెండో తరం వారు ఉండగా మూడో తరం వారిని ఎందుకు తీసుకు వచ్చారు. వేలకు వేలు దేవాలయం భూములు ఉన్న సింహాచలం ట్రస్ట్ బోర్డు కొత్త వారిని నియమించి ఆస్తులు దోచుకునేందుకు పన్నాగం పన్నింది. అశోక్ గజపతిరాజు ని చైర్మన్గా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.  దేవాలయ ఆస్తులను అశోక్ గజపతిరాజు ఒక్కరే కాపాడగలరు. కొత్త వారికి అవకాశం ఇస్తే ఆస్తులను దోచుకుంటారు. ప్రభుత్వం నిర్ణయాలు మార్చుకోకపోతే హిందూ ధార్మిక సంఘాలతో  కలిసి ఉద్యమాన్ని లేవనెత్తుతానని అన్నారు. కోర్టులో కేసులు వేసి న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. 

Related Posts