YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఉగాదికి ఇళ్ల పట్టాలు లేవు

ఉగాదికి ఇళ్ల పట్టాలు లేవు

ఉగాదికి ఇళ్ల పట్టాలు లేవు
విజయవాడ, మార్చి 
రాష్ట్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఓటర్లను ప్రభావితం చేసే పథకాలు నిలిపివేయాలని చెప్పామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ వెల్లడించారు. ఉగాదికి ఇళ్ల పట్టాల పంపిణీ పథకం కోడ్‌ ఉల్లంఘన కిందకే వస్తుందని ఎస్‌ఈసీ రమేష్‌ స్పష్టం చేశారు. రివ్యూలు, సమావేశాలు కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకే వస్తాయన్నారు. అలాగే ఎవరైనా నామినేషన్లు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే తీవ్రంగా పరిగణిస్తామన్నారు.రాష్ట్రంలో అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయని.. అయితే పోలీసులపై తమకు పూర్తి నమ్మకం ఉందని ఎస్‌ఈసీ రమేష్ స్పష్టం చేశారు. అలాగే రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ భవనాలకు నిర్ణీత గడువు లోగా పార్టీ రంగులు తొలగిస్తామన్నారు. అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాల అందజేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు.ఈ నెల 15వ తేదీన మొదటి విడత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని ఎస్‌ఈసీ రమేష్ కుమార్ చెప్పారు. అవసరమైతే గ్రామ, వార్డు వలంటీర్ల సేవలు తీసుకోవచ్చు గానీ.. పార్టీలకు ప్రచారం చేయొద్దని స్పష్టం చేశారు. దివంగత నాయకుల విగ్రహాలకు ముసుగులు అక్కర్లేదని ఎస్‌ఈసీ రమేష్‌ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్న నేపథ్యంలో ఈ పథకం కూడా ఎన్నికల కోడ్ కిందకు వస్తుందని ఎస్ఈసీ చెప్పడంతో ఇది వాయిదా పడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Related Posts