కరోనాపై వాలంటీర్లు ఇంటింటి సర్వే - తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ
మార్చి 12
కరోనా నేపథ్యంలో గ్రామ, వార్డు వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు ప్రతి ఇంటికి వెళ్లి మీ ఇంటికి విదేశాల నుంచి ఎవరైనా వచ్చారా? జ్వరం, దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారా? అన్న వివరాలను మొబైల్ అప్లికేషన్‌లో అవును/కాదు అన్న రూపంలో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ జి విరపాండియన్ వాలంటీర్లు, ఏఎన్ఎంలు సూచించారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఓర్వకలు మండలంలో హుసేన్ పురం లో కరోనా పై వాలంటీర్లు చేపడుతున్న డోర్ టు డోర్ సర్వే ని జిల్లా కలెక్టర్ జి.విరపాండియన్, జిల్లా ఎస్పీ డాక్టర్ కె. పక్కిరప్ప లు తనిఖీ చేసి విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా వంటి వివరాలు వాలిoటర్ ను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటి సర్వే ఆరోగ్య వివరాలను గ్రామ, వార్డు వాలంటీర్లు, ఏఎన్‌ఎం లు ప్రత్యేక మొబైల్ యాప్ లో ఎలా నమోదు చేస్తున్నారు పరిశీలించారు. డోర్ టు డోర్ చేసే సమయంలో ఎవరైనా పాజిటివ్ ఉన్నారా వంటి వివరాలను కలెక్టర్ వాలంటీర్ లను అడిగి తెలుసుకున్నారు. ఏ ఇల్లు తప్పిపోకుండా ఇంటింటికి వెళ్లి సర్వే చేపట్టాలని వాలంటీర్ లకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, తదితరులు పాల్గొన్నారు.