YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మూడు నెలల నుంచే కమలం కసరత్తు

మూడు నెలల నుంచే కమలం కసరత్తు

మూడు నెలల నుంచే కమలం కసరత్తు
భోపాల్, మార్చి 12
శివరాజ్ సింగ్ చౌహన్ పదిహేను నెలల క్రితం ఓటమి పాలయిన తర్వాత హుందాగా తన పదవి నుంచి దిగపోయారు. తమ పార్టీ ఎలాంటి ఆపరేషన్ ఆకర్ష్ కు పాల్పడబోతదని ఆయన చెప్పారు. అదే నిజమనుకుంది కాంగ్రెెస్. నిజానికి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ప్రభుత్వాన్ని కూలదోయడం అస్సలు ఇష్టం లేదు. ప్రజాభిప్రాయం మేరకే నడుచుకోవాలన్నది ఆయన నిర్ణయం. ఇదే విషయాన్ని పదే పదే బీజేపీ ఎమ్మెల్యేల వద్ద కూడా ప్రస్తావించేవారుఅయితే కమల్ నాధ్ ప్రభుత్వంలో అసంతృప్తులు బయటపడుతుండటంతో మూడు నెలల క్రితమే బీజేపీ ప్లాన్ రూపొందించింది. అయితే ఈ వ్యూహం అమలు బాధ్యతను శివరాజ్ సింగ్ చౌహాన్ కు బీజేపీ కేంద్ర నాయకత్వం అమలుపర్చలేదు. వరసగా మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలండంతో బీజేపీ కేంద్ర నాయకత్వం మధ్యప్రదేశ్ పై కన్నేసింది. అక్కడ ముఖ్యనేత జ్యోతిరాదిత్య సింధియా అసంతృప్తిగా ఉన్నారని తెలిసి ప్లాన్ ను అమల్లో పెట్టాలని నిర్ణయించింది.ఇందుకోసం పార్టీ సీనియర్ నేత నరోత్తమ్ మిశ్రాకు అప్పగించింది. నరోత్తమ్ మిశ్రా పార్టీలో సీనియర్ నేత. 1998, 2003, 2008, 2013, 2018 ఎన్నికల్లో ఆయన వరసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. మంత్రిగా కూడా పనిచేశారు. నరోత్తమ్ మిశ్రా సింధియా కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కావడం విశేషం. అందుకే ఈ ఆపరేషన్ బాధ్యతను పార్టీ కేంద్రనాయకత్వం నరోత్తమ్ మిశ్రాకు అప్పగించింది. ఆయన పకడ్బందీగా తన వ్యూహాన్ని అమల్లో పెట్టారు.కాంగ్రెస్ లోని సింధియా వర్గం శాసనసభ్యులతో సఖ్యతగా మెలగడం, వారికి నచ్చచెప్పడం వంటి కార్యక్రమాలను నరోత్తమ్ మిశ్రాయే చేశారు. జ్యోతిరాదిత్య సింధియాను ఒప్పించడంలోనూ సక్సెస్ అయ్యారు. జ్యోతిరాదిత్య సింధియాకు రాజ్యసభ పదవితో పాటు కేంద్ర మంత్రి పదవి కూడా దక్కనుంది. మొత్తం మీద మూడు రాష్ట్రాలను ఇటీవల కాలంలో కోల్పోయిన బీజేపీ దెబ్బతిన్న పులిలా మధ్యప్రదేశ్ మీద విరుచుకుపడింది. సక్సెస్ అయింది

Related Posts