YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆరోగ్యం

40 రూపాయిలకు చికెన్

40 రూపాయిలకు చికెన్

40 రూపాయిలకు చికెన్
కర్నూలు, మార్చి 12
ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ (కోవిడ్- 19) ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. పలు దేశాల్లో మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. ఈ కరోనా భూతం దేశంలోకి సైతం ప్రవేశించడంతో దీని ప్రభావం దేశీయ మార్కెట్ పైగా పడుతోంది. ముఖ్యంగా మాంసం విక్రేతలపై ఈ ప్రభావం దారుణంగా పడిపోడింది. ప్రజలు నాన్‌వెజ్ తినేందుకు భయపడుతుండటంతో విక్రయాలు పడిపోయాయి.ఏపీలో సైతం పలు కరోనా అనుమానిత కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట్రంలోనూ దీని ప్రభావం కనిపిస్తోంది. దీని నిదర్శనంగా రాష్ట్రంలో చికెన్ ధరలు భారీగా పతనమయ్యాయి. తాజాగా చికెన్ ధర మరింత పతనమై కిలో కేవలం రూ. 40 మాత్రమే పలుకుతోంది. చికెన్ తినడం వల్ల ప్రమాదం ఏమీ లేదని నిపుణులు చెబుతున్నా.. ప్రజలు ముందు జాగ్రత్తగా తినడం మానేశారు.దీంతో వ్యాపారులు తీవ్ర నష్టాలను భరించైనా ఉన్న వాటిని అయినకాడికి అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ పరిధిలో ఓ దుకాణ యజమాని కిలో కోడి మాంసాన్ని రూ.40కే విక్రయిస్తానంటూ బోర్డు పెట్టారు. ఆయన లాగే చాలా చోట్ల వ్యాపారులు ధరను భారీగా తగ్గించి విక్రయిస్తున్నారు. నష్టాలను పంటి బిగువన భరిస్తున్నారు.

Related Posts