YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

*మత్సకారుల కృషి, శ్రమ, సమయం వృధా కాకుండా వారికి మరింత రాబడికి సహకరిస్తున్న* *SKILL AP- APSSDC*

*మత్సకారుల కృషి, శ్రమ, సమయం వృధా కాకుండా వారికి మరింత రాబడికి సహకరిస్తున్న* *SKILL AP- APSSDC*

*మత్సకారుల కృషి, శ్రమ, సమయం వృధా కాకుండా వారికి మరింత రాబడికి సహకరిస్తున్న*
*SKILL AP- APSSDC*
రాష్ట్రంలో ఉన్న సుదీర్ఘ సముద్ర తీరప్రాంతం మరియు నదులలో ఉన్న మత్ససంపదని వేటాడి తద్వారా లభించే ఆదాయం మీద ఆధారపడి  అనేక లక్షలమంది జీవనం సాగిస్తున్నారు.ఈ మత్ససంపద లభ్యత అనేది వర్షాలు పడే కాలంలో ఎక్కువుగాను వేసవికాలంలో తక్కువగాను ఉంటుంది. వర్షాకాలంలో అపారంగా లభించే మత్ససంపద ఆ కాలంలో వినియోగం తక్కువ ఉండడము వలన మిగిలిపోయిన సరుకు ని కాపాడుకునే విధానంలో భాగంగా వాటిని ఆరబెట్టడం, ఎండపెట్టడం లాంటి సంప్రదాయ పద్ధతులును అవలంభిస్తారు.ఈ పద్దతిలో మిగిలిపోయిన చేపలు, రొయ్యలు వంటి వాటిని రోడ్ల ప్రక్కన, ఇసుక నేలలు ఎక్కడ ఖాళీ ప్రదేశం దొరికితే అక్కడ ఎండబెట్టడం జరుగుతుంది ఈ సంప్రదాయ పద్ధతుల్లో సూర్యుని సూర్యరశ్మి వేడి లభ్యత మీదే ఆధారపడి బహిరంగంగా ఆరబెట్టడం వలన పరిశుభ్రత అనేది లోపించడమే కాకుండా వర్షాకాలంలో మబ్బులు వలన అవసరమైన సమయంలో సరైన సూర్యరశ్మి వేడి సమాంతరంగా లభించక సరిగ్గా ఎండకపోవడం, అలాగే ఆకాలవర్షాల వలన ఎండపెట్టిన సరుకు సరిగ్గా కాపాడుకోలేక తడిచిపోయి నష్టపోవడం, తేమ వలన మరియు ఇతర ప్రతికూల పరిస్థితుల్లో ఎండపెట్టిన సరుకు రంగు, రూపు, నాణ్యత కోల్పోయి సరైన ధర దొరకక నష్టపోవడమే కాకుండా  ఉత్పత్తిలో సుమారు 50 శాతం వరకూ సరైన పద్దతిలో నిల్వచేసే అవకాశం లేక సరకు పాడైపోయి వేటకారుల శ్రమ, సమయం, ఆదాయం నష్టపోవడం లాంటి విషయాలు గమనించడం జరిగింది.పై సమస్యని అధిగమించి ఉత్పత్తి నష్టాన్ని సున్నా శాతానికి తగ్గించేందుకు రాష్ట్ర మత్సశాఖా సహకారంతో ఒక పైలట్ ప్రాజెక్టు చేపట్టడం జరిగింది.ఈ పైలెట్ ప్రాజెక్టు  కార్యక్రమంలో భాగంగా *APSKILL-APSSDC* కృష్ణా జిల్లా నాగాయాలంకలో, తూర్పు గోదావరి జిల్లా లో ఉన్న  ఎస్సి, ఎస్టీ, బీసీ మత్సకారులకు చేపలు, రొయ్యలు వంటి పలు ఉత్పత్తులను నిల్వచేసే వివిధ పద్ధతులైన చేపలు, రొయ్యలతో పచ్చళ్ళు తయారు చేయడం, తక్షణం ఉపయోగించడానికి సిద్ధంగా ఉండేలా ఉత్పత్తులను ప్రాసెస్ చెయ్యడం వంటివి శిక్షణా కార్యక్రమాలతో  నేర్పించడం జరిగింది.అంతే కాకుండా వర్షాకాలంలో సైతం మిగిలిపోయిన సరుకు ఎండపెట్టుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, శ్రమించి కష్టపడి సేకరించిన మత్స సంపద వృధా కాకుండా పూర్రి గా  ఉపయోగపడి తద్వారా వేట సాగించిన వారు నష్టపోకుండా ఉండేందుకు *సోలార్ డ్రయ్యర్* అనే పరికరం వారికి అందుబాటులో తేవడం జరిగింది.ఇంట్లోనూ బయటనూ ఎక్కడికైనా మోసుకుపోగల ఈ *సోలార్ డ్రయ్యర్* పరికరం *సూర్యరశ్మి,*  *విద్యుత్తు,* *వంట గ్యాస్,* మరియు *బొగ్గుతో* పనిచేస్తుంది. వర్షాకాలంలో లభించిన అధిక సరుకు వర్షాకాలంలో సైతం సూర్యుడు అందుబాటులో వున్నప్పుడు సోలార్ తోను, సూర్యుడు అందుబాటులో లేనపుడు విద్యుత్ తోను, రెండూ అందుబాటులో లేనపుడు వంట గ్యాస్ తో  లేదా బొగ్గుతో పనిచేసి సరుకుని పూర్తిగా ఎండపెట్టి  వృధా ని అరికడుతుంది. ఇది రోజుకు సుమారు 20 కేజీల వరకూ చేపలను, రొయ్యలను ఎండపెడుతుంది. ఒక పరిశుభ్రమైన వాతావరణం లో ఎండబెట్టడం వలన వేడి సరుకుకు సమానంగా వ్యాపించి సరుకు యొక్క రంగు రూపు చెడిపోకుండా నాణ్యతతో ఉండడం వలన మంచి ధర లభించి ఇతర ప్రాంతాల కు సైతం ఎగుమతి చేసే అవకాశాలు మెరుగవుతాయి. సమాజంలో  ప్రతి వారికి ఎదో ఒక కార్యక్రమం ద్వారా సహాయపడి తద్వారా వారి జీవన ప్రమాణాలు పెంచే దిశలో *SKILLAP-APSSDC* ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. డాక్టర్ శ్రీకాంత్
 

Related Posts