చిరు వ్యాపారుల కోసం వాట్సాప్ బిజినెసెస్ అనే కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా చిన్న వ్యాపారులు తమ వ్యాపార సమాచారాన్ని వినియోగదారులతో సులువుగా పంచుకోవచ్చు. సాధారణ వాట్సాప్ మాదిరిగానే దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దీన్ని మరోనంబర్ తో కూడా వినియోగించుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ ను ఉచితంగా పొందవచ్చు.బిజినెస్ యాప్ రానున్న రోజుల్లో భారీ వ్యాపార ప్రణాళికలకు ఉపయోగపడగలదని అంటున్నారు. ఎయిర్ లైన్స్, ఈ కామర్స్ సైట్స్, బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకొని ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులను పెంచుకోవచ్చని అంటున్నారు. ప్రస్తుతం ఇది ఇండోనేషియా, మెక్సికో, యూకే, అమెరికాలలో అందుబాటులో ఉంది. అక్కడ జనాదరణ పొందుతోంది.ఈ యాప్ లో తమ వ్యాపారాలను నమోదుచేసుకున్నవారికి వెరిఫికేషన్ పూర్తైన తర్వాత వెరిఫైడ్ అంటూ గ్రీన్ కలర్ టిక్ వస్తుంది. కస్టమర్లతో మంచి సంబంధాలను నెరపడానికి.. వారు అడిగిన వాటికి త్వరగా రిప్లై ఇ్వవడానికి.. వారికి గ్రీటింగ్ మెసేజ్‌లు పంపడానికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. అయితే కస్టమర్ల అనుమతితోనే వ్యాపారులు మెసేజ్‌లు పంపగలరు. వ్యాపార వేళలను వినియోగదారులకు మెసేజ్ ద్వారా తెలుపుతుంది.
బిజినెస్ యాప్ రానున్న రోజుల్లో భారీ వ్యాపార ప్రణాళికలకు ఉపయోగపడగలదని అంటున్నారు. ఎయిర్ లైన్స్, ఈ కామర్స్ సైట్స్, బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకొని ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులను పెంచుకోవచ్చని అంటున్నారు.