YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

15వ తేదీ నుంచి ఒంటి పూట బడులు

15వ తేదీ నుంచి ఒంటి పూట బడులు

15వ తేదీ నుంచి ఒంటి పూట బడులు
అమరావతి, మార్చి 12,
పెరుగుతున్న ఉష్ణోగ్రత్తల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఒంటి పూట బడులను మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలలకు వర్తించేలా ఉత్తర్వులు జారీచేసింది. ఈనెల 15వ తేదీ నుంచి ఒంటి పూట బడులు ప్రారంభించాలని విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచన మేరకు రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్‌ వి.చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 15 నుంచి ఏప్రిల్‌ 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయని, ఆ తర్వాత సెలవులు ఉంటాయని అయన వెల్లడించారు.ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉండగా, జూన్‌ 12న తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని వెల్లడించారు. ఇక, ఒంటిపూట బడులపై అనుసరించాల్సిన విధులను అయన పేర్కొన్నారు. ఒంటిపూట బడులను తప్పనిసరిగా అన్ని పాఠశాలలు అమలు చేయాలని పేర్కొన్నారు. వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి పాఠశాలలో మంచినీటిని అందుబాటులో ఉంచాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ తరగతులను ఆరు బయట, చెట్ల కింద నిర్వహించరాదని వెల్లడించారు. ఇక మధ్యాహ్న భోజనాన్ని ఒంటిపూట బడి సమయం ముగిసేలోగా విద్యార్థులకు అందించాలని పేర్కొన్నారు. విద్యార్థులకు వడదెబ్బ తగలకుండా స్కూళ్లలో ఓరల్‌ రీ హైడ్రేషన్‌ సొల్యూషన్‌ (ఓఆర్‌ఎస్‌) ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాలని అన్నారు.ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 7–45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు 6 పీరియడ్లు పనిచేయాలని వెల్లడించారు. మరోవైపు, తెలంగాణాలో ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏపీలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను నెలాఖరుకు మార్పుచేశారు. మార్చి 31న ప్రారంభమయ్యే పరీక్షలను పక్కాగా నిర్వహించడంపై ప్రభుత్వం దృష్టిసారించింది.

Related Posts