YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ దేశీయం

కుస్తాపూర్ వాసిని అరెస్టు చేసిన జమ్మూ పోలీసులు

కుస్తాపూర్ వాసిని అరెస్టు చేసిన జమ్మూ పోలీసులు

కుస్తాపూర్ వాసిని అరెస్టు చేసిన జమ్మూ పోలీసులు
జగిత్యాల, మార్చి 12
దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన వ్యక్తికి గూగుల్ పే లో డబ్బులు పంపారనే ఆరోపణలతో ఈ నెల 3న జమ్ము కాశ్మీర్ జిల్లా అర్నియా పోలీసులు జగిత్యాల జిల్లా మల్లాపూర్ కు చేరుకున్నారు. మల్లాపూర్ మండలం కుస్తాపూర్ గ్రామానికి చెందిన లింగన్న తన గూగుల్ పే నుండి దేశద్రోహం కేసులో అరెస్టయిన రాకేష్ కు జనవరి 15 న 6 వేలు, ఫిబ్రవరి 5న 5 వేలు, ఫిబ్రవరి 20 న 4 వేలు పంపాడు. దీంతో లింగన్నను మల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో జమ్ము పోలీసులు విచారించగా దుబాయిలో ఉంటున్న తన బావ శ్రీనివాస్ కొన్నేళ్లుగా దుబాయిలో పనిచేస్తున్నాడని తాను డబ్బులు పంపాలని చెబితేనే గూగుల్ పే లో రాకేష్ అనే వ్యకిక్తి డబ్బులు పంపినట్లు విచారణలో తెలిపాడు. కాగా ఈ నెల 4న లింగన్నను జమ్ము తీసుకెళ్లేందుకు పోలీసులు సిద్ధం కాగా మెటుపల్లి కోర్టులో హజరుపర్చారు. అయితే జమ్ము పోలీసులకు కోర్టు అనుమతి లభించలేదు. లింగన్నను అదుపులోకి తీసుకోవాలని జమ్ము కాశ్మీర్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని, మెయిల్ ద్వారా వచ్చిన ఉత్తర్వుల కాపీలను తీసుకొని మల్లాపూర్ పోలీసుల సమక్షంలో మెటుపల్లి
మెజిస్ట్రేట్ ముందు హజరుపరిచారు. దీంతో ఒరిజినల్ కాపీలు కోర్టుకు సమర్పించే వరకు లింగన్నను జమ్ముకాశ్మీర్ పోలీసులకు అప్పగించరాదని మెటుపల్లి మెజిస్ట్రేట్ మల్లాపూర్ పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో వ్యక్తిగత పూచీకత్తుపై లింగన్నను కుటుంబసభ్యులకు అప్పగించారు. 11వ తేదీన జమ్ము పోలీసులకు ఒరిజినల్ కాపీలు అందడంతో మల్లాపూర్ పోలీసుల సమక్షంలో నిన్న రాత్రి లింగన్నను మెజిస్ట్రేట్ ముందు హజరుపరచగా అనుమతి లభించడంతో లింగన్నను జమ్ముకు
తరలించారు. కాగా ఈ ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది.

Related Posts