YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పీసీసీ అధ్యక్షుడిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి...!

పీసీసీ అధ్యక్షుడిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి...!

పీసీసీ అధ్యక్షుడిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి...!
-కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ
హైదరాబాద్, మార్చి 12
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పీసీసీ అధ్యక్ష పదవి వరించే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. దీనికి బలం చేకూర్చేలా.. అధిష్ఠానం ఆయన్ను ఢిల్లీకి పిలిపించింది.  ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ..  ప్రస్తుతం కాంగ్రెస్ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ నివాసంలో ఆమెతో భేటీ అయ్యారు. తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన అంశాలను ఆమెకు వివరించినట్లుగా తెలుస్తోంది. నేడో రేపో అధికారికంగా ప్రకటన వెలువడనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి.
సామాన్య కార్యకర్తగా పనిచేస్తా: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి  తెలంగాణలో పార్టీ బలోపేతం, ప్రస్తుత పరిస్థితులపై కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో చర్చించానని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పునర్వ్యవస్థీకరణపై సోనియాతో చర్చించానన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం ఉన్న వ్యక్తిని... తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమించడాన్ని సోనియాకు వివరించానన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే సామాన్య కార్యకర్తగా పనిచేస్తానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. పనిచేసే కార్యకర్తలతో నూతన టీమ్‌ ఏర్పాటు చేయాలని కోరానన్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కార్యకర్తగా ఉంటూ... అంచెలంచెలుగా ఎదిగానన్నారు. కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

Related Posts