YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

.ప్రజాస్వామ్యం లో ఉన్నామా

.ప్రజాస్వామ్యం లో ఉన్నామా

.ప్రజాస్వామ్యం లో ఉన్నామా
కడప, మార్చి 12 
ఎన్నికలు జరుగుతున్న తీరును చూస్తే అటవీ రాజ్యంలో ఉన్నామా, ప్రజాస్వామ్యం లో ఉన్నామా అన్న అనుమానం వ్యక్తం అవుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఆరోపించారు. కడప నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అభ్యర్థులపై దాడులకు తెగబడటం, నామినేషన్ పత్రాలను చించడం అవసరమా అని అన్నారు. గ్రామాలను సైతం వదిలి వెళ్లేలా భయబ్రాంతులకు గురి చేయడం సిగ్గు చేటని, అధికారులను అడ్డంగా పెట్టుకోని టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు తొలగించి పోటీ లేకుండా గెలవాలన్న గెలుపు ఒక గెలుపేనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరిగిన ఘటనల నేపద్యంలో కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని, బీహార్ తలదన్నేలా పోలీసుల సమక్షంలోనే  వైసీపీ దాడులకు తెగబడుతుందన్నారు. వందలాది మంది అభ్యర్థులను బెదిరించి నామినేషన్ లు వేయకుండా అడ్డుకున్న వైసీపీ నేతలు, ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ఎన్నికల కమిషన్ ఏమి చేస్తోందన్నారు. ఓటమి భయంతో నే  ఇలాంటి దాడులు చేస్తున్నారని, పోలీసులు  సైతం ప్రతిపక్షలను బైండోవర్ కేసులు పెడతామంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని అన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదని, జరిగిన ఘటనలపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. హైకోర్టు కు వెళ్ళి న్యాయ పోరాటం చేసి నామినేషన్ వేయకుండా అడ్డుకున్న చోట మళ్ళీ ఎన్నిక జరిపేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జెడ్పీటీసీ అభ్యర్థులకు  జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం లో వేలం పాట పెట్టారని,నామినేషన్ అడ్డుకున్న ప్రాంతాల్లో తిరిగి నామినేషన్ పక్రియ చేపట్టాలన్నారు.

Related Posts