YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

11 లక్షల కోట్ల నష్టం బేర్ మన్న మార్కెట్లు

11 లక్షల కోట్ల నష్టం  బేర్ మన్న మార్కెట్లు

11 లక్షల కోట్ల నష్టం
బేర్ మన్న మార్కెట్లు
ముంబై, మార్చి 12 
బేర్ దెబ్బకు బుల్ పారిపోయింది. కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమో ఈరోజు స్టాక్ మార్కెట్‌‌కు నిజంగా తెలిసొచ్చింది. బెంచ్‌మార్క్ సూచీలు అడ్డూఅదుపు లేకుండా పేకమేడ కూలిపోయినట్లు అలా పడిపోతూనే వచ్చాయి. అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాల సునామీ కనిపించింది. ఇన్వెస్టర్లు మహా పతనం అంటే ఏమిటో చూశారు. ఒకే రోజులో రూ.11 లక్షల కోట్లకు పైగా పోగొట్టుకున్నారు.కరోనాకు తోడు క్రూడ్‌ ఆయిల్‌ ధరల పతనం కూడా ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు అతి భారీగా పతనమయ్యాయి. 3,100 పాయింట్లకు పైగా నష్టాల్లో సెన్సెక్స్‌, 930 పాయింట్లకు పైగా నష్టాల్లో నిఫ్టీ కొనసాగుతోంది. అన్ని రంగాల సూచీలు 52 వారాల కనిష్ట స్థాయిలో ట్రేడవుతున్నాయి. 7-8 శాతానికి పైగా మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు నష్టపోయాయి. 10 శాతానికి పైగా బ్యాంకు నిఫ్టీ నష్టపోయింది. ఇటు గ్లోబల్ మార్కెట్ల ప్రభావం.. ఆసియా మార్కెట్లపై పడింది. దీంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోతున్నాయి. ఇవాళ సెన్సెక్స్‌, నిఫ్టీ గ్యాప్‌ డౌన్‌ ఓపెనింగ్‌ తో మదుపర్లు కుదేలయ్యారు. హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు ఫ్లాట్‌ లో కొనసాగుతుండగా.. ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, బ్రిటానియా, బజాజ్‌ ఫినాన్స్‌, హీరో మోటార్‌కార్ప్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ఎల్‌ఐసీ హౌసింగ్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌ఓ) కరోనా వైరస్‌ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించడంతో గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లు పతనమయ్యాయి. ఈ ఎఫెక్ట్ మన మార్కెట్‌పై కూడా పడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఏకంగా 3,200 పాయింట్లకు పైగా కుప్పకూలింది. 32,493 స్థాయికి దిగొచ్చింది. నిఫ్టీ కూడా 950 పాయింట్లు క్షీణించింది. 9,508 స్థాయికి వచ్చేసింది. సూచీలు ఒక్క రోజులో ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. చివరకు సెన్సెక్స్ 2,919 పాయింట్ల నష్టంతో 32,778 వద్ద, నిఫ్టీ 868 పాయింట్ల నష్టంతో 9,590 వద్ద క్లోజయ్యాయి.
✺ నిఫ్టీ 50లో యస్ బ్యాంక్, యూపీఎల్, వేదాంత, హిందాల్కో, ఓఎన్‌జీసీ షేర్లు నష్టపోయాయి. యస్ బ్యాంక్ 13 శాతం మేర పతనమైంది. ఇక నిఫ్టీ 50లో లాభపడిన షేర్లు అంటూ ఏమీ లేవు.
✺ నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లో క్లోజయ్యాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 13 శాతం పడిపోయింది. నిఫ్టీ మీడియా ఇండెక్స్ 10 శాతం, నిఫ్టీ బ్యాంక్.. నిఫ్టీ మెటల్.. నిఫ్టీ రియల్టీ.. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్‌లు 9 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లు 8 శాతం క్షీణించాయి.
✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి నష్టాల్లో ట్రేడవుతోంది. 53 పైసలు నష్టంతో 74.18 వద్ద కదలాడుతోంది. రూపాయి ఇంట్రాడేలో 74.5 స్థాయికి కూడా పతనమైంది.
✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 5.62 శాతం తగ్గుదలతో 33.84 డాలర్లకు క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 5.4 శాతం క్షీణతతో 31.20 డాలర్లకు పతనమైంది.

Related Posts