YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ దేశీయం

కేంద్రం మోసం చేసింది : కేసీఆర్

కేంద్రం మోసం చేసింది : కేసీఆర్

కేంద్రం మోసం చేసింది : కేసీఆర్
హైద్రాబాద్, మార్చి 12 
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే అని సీఎం కేసీఆర్‌ అన్నారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. బీజేపీ నాయకులు అసత్యాలు మాట్లాడుతున్నారని సీఎం మండిపడ్డారు. బీజేపీ వాళ్లకు లేకలేక అధికారం వచ్చింది. ఇంతకుముందు ఎన్డీఏకు వచ్చింది. యూపీఏ పాలనపై విసుగుతోనే దేశ ప్రజలు బీజేపీకి ఓటేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి అవకాశం లేకలేక రాలేదు. రాష్ర్టాన్ని సాధించుకుని మొదటిసారి పోటీ చేశాం.. అధికారంలోకి వచ్చామని సీఎం తెలిపారు. దేశంలో కాంగ్రెస్‌, బీజేపీలు అట్టర్‌ప్లాఫ్‌ అయ్యాయని కేసీఆర్‌ పేర్కొన్నారు. లేకలేక వచ్చిన అవకాశాన్ని బీజేపీ తీవ్రంగా దుర్వినియోగం చేస్తోంది. కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు ఇచ్చిందేమీ లేదు. రాజ్యాంగం ప్రకారం రావాల్సిందే కేంద్రం తెలంగాణకు ఇచ్చింది. పన్నులు వసూలు చేసే బాధ్యతను మాత్రమే కేంద్రానికి ఇచ్చారు. దేశంలో కాంగ్రెస్‌, బీజేపీలు అట్టర్‌ ప్లాఫ్‌ అయ్యాయని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అప్పటి నుంచి తెలంగాణకు ఇచ్చిన నిధులేమీ లేవని విమర్శించారు. నిబంధనల ప్రకారం రాష్ట్రానికి రావాల్సిందే.. ఇస్తున్నారు తప్ప వివిధ ప్రాజెక్టులకు సాయం చేసిందేమీ లేదని గుర్తు చేశారు. జీఎస్టీ వల్ల కలిగే నష్టాన్ని ఐదేళ్ల పాటు కేంద్రమే భరిస్తుందని చట్టంలో చేర్చారు. కానీ, సీఎస్టీ పేరుతో కాంగ్రెస్‌, జీఎస్టీ పేరుతో బీజేపీ రాష్ర్టాలకు నిధులను ఎగ్గొట్టాయని విమర్శించారు.జీఎస్టీ వల్ల కలిగే నష్టాన్ని ఐదేళ్ల పాటు కేంద్రమే భరిస్తుందని చట్టంలో చేర్చారు. సీఎస్టీ పేరుతో కాంగ్రెస్‌, జీఎస్టీ పేరుతో బీజేపీ రాష్ర్టాలకు నిధులను ఎగ్గొట్టాయి. వసూలు చేసిన పన్నుల్లో రాష్ర్టాలకు వాటా ఇవ్వడం కేంద్ర దయాదాక్షిణ్యాలు కాదు. జీఎస్టీ వచ్చిన తర్వాత రాష్ర్టానికి ఏ సంవత్సరంలోనూ రూ. 10 వేల కోట్లు ఇవ్వలేదు. దేశానికి అన్నం పెట్టే రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. కాంగ్రెస్‌కు బీజేపీ తాతలా మారింది. బీజేపీ నేతలు నీచపు బుద్ధి మానుకోవాలి అని సీఎం హెచ్చరించారు. 

Related Posts