YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా దేశీయం

రెండు నెల్లో విజయ్ పై రెండోసారి ఐటీ దాడులు

రెండు నెల్లో విజయ్ పై రెండోసారి ఐటీ దాడులు

 రెండు నెల్లో విజయ్ పై రెండోసారి ఐటీ దాడులు
చెన్నై, మార్చి 12 
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తోన్న ‘మాస్టర్’ సినిమా సహ నిర్మాత లలిత్ కుమార్ ఇల్లు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. సోమవారం ప్రారంభమైన ఈ సోదాలు మంగళవారం సాయంత్రం వరకు కొనసాగాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. విజయ్ సినిమాలకు సంబంధించి ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. అయితే, ఈసారి కూడా విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయని వార్తలు వచ్చాయి. కానీ, అందులో నిజం లేదని తెలిసింది. కేవలం లలిత్ కుమార్ ఇల్లు, ఆఫీసుల్లోనే సోదాలు జరిగాయని సంబంధిత వ్యక్తులు వెల్లడించారు. విజయ్ ‘బిగిల్’ సినిమా లెక్కలకు సంబంధించి కిందటి నెలలో ఆదాయ పన్ను శాఖ అధికారులు చెన్నైలో సోదాలు నిర్వహించారు. నెయ్వేలిలో ‘మాస్టర్’ షూటింగ్‌లో ఉన్న విజయ్ వద్దకు వెళ్లిన అధికారులు అక్కడ ఆయన్ని విచారించడంతో పాటు తమతో చెన్నైకు తీసుకొచ్చారు. సాలిగ్రామం, పనియార్‌లోని విజయ్ ఇళ్లలో సోదాలు నిర్వహించారు. విజయ్‌ను గంటలపాటు ప్రశ్నించారు. అదే సమయంలో ‘బిగిల్’ సినిమా నిర్మాత, ఫైనాన్షియర్ అయిన అంబు చెళియన్ ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం రూ. 165 కోట్లకు సంబంధించి పన్ను ఎగవేశారని ఆ సోదాల్లో తేలింది.ఆ సోదాల్లో చెన్నై, మదురైలోని రహస్య ప్రాంతాల్లో దాచిపెట్టిన రూ. 77 కోట్లను, 1.25 కేజీల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. ఇవన్నీ ఫైనాన్షియర్ చెళియన్‌కు చెందినవే. ఈ సోదాలు జరిగిన తరవాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విజయ్ ఫ్యాన్స్ విమర్శలు చేయడం మొదలుపెట్టారు. విజయ్‌ను కావాలనే టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు మరోసారి విజయ్ సినిమాకు సంబంధించి ఐటీ సోదాలు జరగడంతో ఫ్యాన్స్ మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 15న చెన్నైలో ‘మాస్టర్’ ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ రైడ్స్ గురించి విజయ్ మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు.

Related Posts