YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సత్తా చాటుతోన్న వైసీపీ

సత్తా చాటుతోన్న వైసీపీ

సత్తా చాటుతోన్న వైసీపీ
విజయవాడ, మార్చి 12 
స్థానిక ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటుతోంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మాచర్ల నియోజకవర్గంలో మొత్తం 71 ఎంపీటీసీ స్థానాలకు గాను 60 స్థానాల్లో వైసీపీ జెండా ఎగురవేసింది. 60 స్థానాల్లో ఒకే ఒక నామినేషన్ దాఖలు కావడంతో ఎన్నిక ఏకగ్రీవమయింది. టీడీపీ నుంచి పోటీ చేసే వారే కరువయ్యారు. అయితే తమ పార్టీ అభ్యర్థులను భయభ్రాంతులకు వైసీపీ నేతలు గురిచేసి ఏకగ్రీవం చేసుకున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. మరో వైపుగ్రామాల్లో సర్పంచ్‌లతోపాటు వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికైతే ఆ గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ప్రోత్సహకాలు అందించనుంది. ఇలా ఏకగ్రీవాలు జరిగేచోట గ్రామ జనాభా ఆధారంగా రూ. 5 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఇవ్వనుంది. 2 వేల లోపు జనాభా ఉండే పంచాయతీలు ఏకగ్రీవమైతే రూ. 5 లక్షలు, పది వేల జనాభా ఉండే గ్రామం ఏకగ్రీవమైతే రూ. 20 లక్షలు ప్రోత్సాహకంగా ఇవ్వనుంది.  స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగిస్తోంది. చాలా చోట్ల ఏకగ్రీవాలను కైవసం చేసుకుంది. కేవలం వైసీపీకి చెందిన నామినేషన్లే కొన్నిచోట్ల వచ్చాయి. దాంతో భారీగా ఏకగ్రీవాలు జరిగాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా ఎంపీటీసీ ఏకగ్రీవాలను దక్కించుకుంది వైసీపీ. మాచర్ల నియోజకవర్గంలో 71 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వైసీపీకి ఏకగ్రీవంగా 60 దక్కాయి.   ఈ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలంలో 14 ఎంపీటీసీ స్థానాల్లో ఒకే పార్టీకి చెందిన నామినేషన్లు వచ్చాయి.  రెంటచింతల మండలంలో 13 , దుర్గి లో 12 , మాచర్లలో 9 , కారంపూడిలో 9 ఎంపీటీసీల ఏకగ్రీవాలు అయ్యాయి. ఇక నరసరావుపేట నియోజకవర్గంలో 6 చోట్ల ఒకటే నామినేషన్ దాఖలైంది. దాంతో ఇక్కడ కూడా ఆరు ఎంపీటీసీలు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి.  అలాగే రాష్ట్రవ్యాప్తంగా పలు మండలాల్లో వైసీపీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్ వేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం, గిద్దలూరు, దర్శి , కనిగిరి నియోజకవర్గాల్లో భారీగా ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.  తూర్పు గోదావరి జిల్లాలో 6 చోట్ల ఎంపీటీసీలు ఏకగ్రీవమైతే.. శ్రీకాకుళంలో 2 చోట్ల వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు సొంత ఇలాకాలో ఎదురుదెబ్బ తగిలింది. రాజాం నియోజకవర్గం రేగిడి ఆమోదాలవలసలో 3 , సంతకవిటి మండలంలో 2 ఎంపీటీసీ లు ఏకగ్రీవం అయ్యాయి. పలాస నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరు మండలంలో 3 ఎంపీటీసీలు, ఎచ్చెర్ల నియోజకవర్గంలో 1 ఎంపీటీసీ ఏకగ్రీవం అయ్యాయి. ఇక పాలకొండ నియోజకవర్గం వీరఘట్టంలో ఒకటే నామినేషన్ వచ్చినట్టు ఈసీ తెలియజేసింది.

Related Posts